పూలతోటలో... షూ తొట్లు
మీరు ఇంతకు ముందు ఎన్నో రకాల పూలతొట్లు చూసుంటారు. మట్టి తొట్లు, ప్లాస్టిక్ తొట్లు, గాజు తొట్లు ఇలా ఎన్నెన్నో.. కానీ పాడైపోయిన షూలలో మొక్కలను పెంచడం, పూలను పూయించడం ఎక్కడైనా చూశారా..! అవునండి.. ఇకపై మీ ఇళ్లలో ఎవరి షూలైనా పాడైతే, వాటిని పడేయకుండా దాచండి. అందులో మీకు ఇష్టమైన పూల మొక్కలను పెంచండి. ఒకే రకమైన షూలనే కాదు.. ఫార్మల్, స్పోర్ట్స్, హిల్ షూ.. ఇలా వేటినైనా సులువుగా తొట్లుగా మార్చొచ్చు. అవి మరీ చిరిగి పోయాయనుకోండి. వాటికి మీ ఇష్టమైన కలర్ పెయింట్ వేసుకోవచ్చు. దాంతో అవి మరింత అందంగా తయారవుతాయి.
ఇవి పచ్చదనాన్నే కాదు, ఇంటి సౌందర్యాన్నీ పెంచుతాయి. ఓసారి పక్కనున్న ఫొటోలపై లుక్యేయండి. అంతా మీకే అర్థమవుతుంది. వీటికి లేస్ ఉన్న షూలైనా.. లేస్ లేని షూలైనా ఫర్వాలేదు. ఇప్పుడు మీకూ ఇలాంటి తొట్లను మీ తోటల్లో పెట్టాలని ఉంది కదూ.. మరి కానివ్వండి..!