బేషరమిత్వ | Small Poetry of Saif Ali | Sakshi
Sakshi News home page

బేషరమిత్వ

Published Sun, Jan 18 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

బేషరమిత్వ

బేషరమిత్వ

చిట్టి కవితలు
- సైఫ్ అలీ

 
స్త్రీకిచ్చే అత్యంత గౌరవం
బేషరమై ప్రేమించడమే
 
న్యాయదేవతకన్నా.... ఆడోళ్ళు గొప్పోళ్ళు బేషరం
ఏది పట్టించుకోకుండా మూర్ఖులను కూడా ప్రేమిస్తారు
 
పూలదండలతో గుమ్మం మొత్తం సింగారించినా
ఏం లాభం సీతాకోకచిలుకలకు ఏదో భయం నా బేషరం గుమ్మంలోకి రావడానికి
 
దునియాలో నీకు నచ్చే నీలాంటి వారు ఒక్క చోటే దొరుకుతారు
బేషరం అద్దాల గోడలున్న గదిలో తప్పిస్తే ఇంకెక్కడ దొరకరు
 
నీకు కావల్సినంత ప్రేమ ఎప్పటికీ దొరకదు ఈ లోకంలో
కాని నువ్వు బేషరమై ఇంకొకరికి కావల్సినంత ప్రేమ ఇవ్వొచ్చు
 
ప్రపంచంలో ఎన్నో రకాల పనికిమాలిన గురువులు ఎంతో మంది ఉండొచ్చు
వాస్తవానికి మగాడికి మాత్రం బేషరం స్త్రీయే
అద్భుతమైన గురువు
నాకు నా జీవితంలో అతి ముఖ్యమైన విషయం
ఎవరూ బోధించలేదు
బేషరమై అవసరమైనప్పటి నుంచి నా శ్వాసని
నేనే తీసుకోవడం మొదలెట్టాను
 
ప్రాచీన ప్రేమ కావ్యాలు చదువుతుంటే ఒక్కటే అనిపిస్తది
నాకన్నా ముందే ఎంతో మంది బేషరంలు
ఈ మట్టి మీద పుట్టి ఉన్నారని
 
వాస్తవానికి అందరు కోరుకునే జీవన విధానం ఒక్కటే
ఎన్ని కష్టాలు పడ్డా చివరకు బేషరం సుఖం కోసమే
 
ముసలితనం ఎప్పుడు ప్రారంభమౌతుందో నీకు తెలిసే క్షణం
మై బేషరం చిన్నపిల్లాడిని కాదని అనుకోవడం
షురు చేసిన సమయం
(facebook: Directorgoreysaifali )
 

Advertisement

పోల్

Advertisement