Saif Ali
-
బాలీవుడ్లో కమల్ అమర్హై
విశ్వనాయకుడు బాలీవుడ్లో అమర్హై అనడానికి సిద్ధమవుతున్నారు. కమలహాసన్ హిందీ చిత్ర పరిశ్రమకు సుపరిచితులని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1980 ప్రాంతంలో పలు విజయవంతమైన చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షలకులతో పాటు ప్రపంచ సినీ ప్రియుల్ని అలరించిన ఘన చరిత్ర కమల్‌ది. ఏక్దూజె కే లియే, ఏక్నై పహేలి, గిరఫ్తర్, నయా అందాజ్, దో దిల్ దివానే అలా పలు సూపర్ హిట్ చిత్రాలు కమలహాసన్ ఖాతాలో ఉన్నాయి. ఆయన హిందీలో నటించిన చివరి చిత్రం చాచీ420. ఇది1997లో తెరపై కొచ్చింది. ఆ తరువాత కమల్ హిందీలో నటించలేదు. సుమారు ఎనిమిదేళ్ల తరువాత అమర్హై అంటూ బాలీవుడ్ పునఃప్రవేశానికి సన్నద్ధమవుతున్నారు. ఇందులో విశేషాలు చాలానే ఉన్నాయి. అమర్హై చిత్రానికి దిశ నిర్థేశకుడు కమల్‌నే. ఇప్పటి వరకూ కమలహాసన్ హిందీలో నటనకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు కథకుడు, నటుడు, దర్శకుడు అంటూ మూడు విభాగాల్లో విజృంభించనున్నారు. ఇది మల్టీస్టారర్ చిత్రం. కమల్‌తో పాటు సైఫ్ అలీఖాన్ కథానాయకుడిగా నటించనున్నారు. అసలు ఈయన్ని దృష్టిలో పెట్టుకునే కమల్ ఈ చిత్ర కథను తయారు చేశారట. ఇది రాజకీయం, అండర్‌వరల్డ్ మాఫియాల నేపథ్యంలో సాగుతుందట. దీన్ని ముంబయి నిర్మాతలు వీరేంద్ర కే అరోరా, అర్జున్ఎ కపూర్ నిర్మించనున్నారు.ప్రస్తుతం కమల్ తూంగావనం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తరువాత అమర్హై చిత్రానికి సిద్ధం కానున్నారు. -
బేషరమిత్వ
చిట్టి కవితలు - సైఫ్ అలీ స్త్రీకిచ్చే అత్యంత గౌరవం బేషరమై ప్రేమించడమే న్యాయదేవతకన్నా.... ఆడోళ్ళు గొప్పోళ్ళు బేషరం ఏది పట్టించుకోకుండా మూర్ఖులను కూడా ప్రేమిస్తారు పూలదండలతో గుమ్మం మొత్తం సింగారించినా ఏం లాభం సీతాకోకచిలుకలకు ఏదో భయం నా బేషరం గుమ్మంలోకి రావడానికి దునియాలో నీకు నచ్చే నీలాంటి వారు ఒక్క చోటే దొరుకుతారు బేషరం అద్దాల గోడలున్న గదిలో తప్పిస్తే ఇంకెక్కడ దొరకరు నీకు కావల్సినంత ప్రేమ ఎప్పటికీ దొరకదు ఈ లోకంలో కాని నువ్వు బేషరమై ఇంకొకరికి కావల్సినంత ప్రేమ ఇవ్వొచ్చు ప్రపంచంలో ఎన్నో రకాల పనికిమాలిన గురువులు ఎంతో మంది ఉండొచ్చు వాస్తవానికి మగాడికి మాత్రం బేషరం స్త్రీయే అద్భుతమైన గురువు నాకు నా జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఎవరూ బోధించలేదు బేషరమై అవసరమైనప్పటి నుంచి నా శ్వాసని నేనే తీసుకోవడం మొదలెట్టాను ప్రాచీన ప్రేమ కావ్యాలు చదువుతుంటే ఒక్కటే అనిపిస్తది నాకన్నా ముందే ఎంతో మంది బేషరంలు ఈ మట్టి మీద పుట్టి ఉన్నారని వాస్తవానికి అందరు కోరుకునే జీవన విధానం ఒక్కటే ఎన్ని కష్టాలు పడ్డా చివరకు బేషరం సుఖం కోసమే ముసలితనం ఎప్పుడు ప్రారంభమౌతుందో నీకు తెలిసే క్షణం మై బేషరం చిన్నపిల్లాడిని కాదని అనుకోవడం షురు చేసిన సమయం (facebook: Directorgoreysaifali )