
బాలీవుడ్‌లో కమల్ అమర్‌హై
విశ్వనాయకుడు బాలీవుడ్‌లో అమర్‌హై అనడానికి సిద్ధమవుతున్నారు. కమలహాసన్ హిందీ చిత్ర పరిశ్రమకు సుపరిచితులని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1980 ప్రాంతంలో పలు విజయవంతమైన చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షలకులతో పాటు ప్రపంచ సినీ ప్రియుల్ని అలరించిన ఘన చరిత్ర కమల్‌ది. ఏక్‌దూజె కే లియే, ఏక్‌నై పహేలి, గిరఫ్‌తర్, నయా అందాజ్, దో దిల్ దివానే అలా పలు సూపర్ హిట్ చిత్రాలు కమలహాసన్ ఖాతాలో ఉన్నాయి.
ఆయన హిందీలో నటించిన చివరి చిత్రం చాచీ420. ఇది1997లో తెరపై కొచ్చింది. ఆ తరువాత కమల్ హిందీలో నటించలేదు. సుమారు ఎనిమిదేళ్ల తరువాత అమర్‌హై అంటూ బాలీవుడ్ పునఃప్రవేశానికి సన్నద్ధమవుతున్నారు. ఇందులో విశేషాలు చాలానే ఉన్నాయి. అమర్‌హై చిత్రానికి దిశ నిర్థేశకుడు కమల్‌నే. ఇప్పటి వరకూ కమలహాసన్ హిందీలో నటనకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు కథకుడు, నటుడు, దర్శకుడు అంటూ మూడు విభాగాల్లో విజృంభించనున్నారు.
ఇది మల్టీస్టారర్ చిత్రం. కమల్‌తో పాటు సైఫ్ అలీఖాన్ కథానాయకుడిగా నటించనున్నారు. అసలు ఈయన్ని దృష్టిలో పెట్టుకునే కమల్ ఈ చిత్ర కథను తయారు చేశారట. ఇది రాజకీయం, అండర్‌వరల్డ్ మాఫియాల నేపథ్యంలో సాగుతుందట. దీన్ని ముంబయి నిర్మాతలు వీరేంద్ర కే అరోరా, అర్జున్‌ఎ కపూర్ నిర్మించనున్నారు.ప్రస్తుతం కమల్ తూంగావనం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తరువాత అమర్‌హై చిత్రానికి సిద్ధం కానున్నారు.