అబద్ధమే ఆభరణమట! | special story on fundya | Sakshi
Sakshi News home page

అబద్ధమే ఆభరణమట!

Published Sat, Aug 26 2017 11:23 PM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

అబద్ధమే ఆభరణమట!

అబద్ధమే ఆభరణమట!

‘సత్యం పలికే హరిశ్చంద్రులం! అవసరానికో అబద్ధం!!’ ఈ లైన్‌ గుర్తుందా..? బ్లాక్‌ బాస్టర్‌ మూవీ... ‘ఖడ్గం’ సినిమాలో మంచి ఊపున్న సాంగ్‌లోనిదీ లైన్‌!! ఈరోజుల్లో అవసరానికో అబద్ధం చెప్పని వారే ఉండరు!! నిజానికి అక్షరాభ్యాసం నాడే అబద్ధమాడకూడదని బోధిస్తారు మన పెద్దలు. అక్షరాలు నేర్చుకున్న నాటి నుంచీ... సత్యమార్గాన నడిచిన మహాత్మా గాంధీనీ, అవమానాలను తట్టుకున్న సత్య హరిశ్చంద్రుడినీ ఉదహరిస్తూ కథలు చెబుతారు.

సామ, దాన, దండోపాయాల్లో భాగంగా అబద్ధమాడితే తల వేయి ముక్కలవుతుందంటూ భయపెడతారు కూడా! చెప్పిన మాట నిజమో కాదో నిర్ధారించుకోవడానికి ప్రమాణాలు చేయించుకోవడం అలవాటు చేస్తుంటారు. కానీ, అవసరం కొన్ని సార్లు అబద్ధమాడిస్తుంది. అరుదైన అవకాశం కోసం, ఆత్మరక్షణ కోసం అసత్యమే శరణమనిపిస్తుంది. అందులో భాగంగానే ‘బాస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ కరెక్ట్‌’ అనే నానుడి బలపడుంటుంది. చిన్న చిన్న అబద్ధాలు ఆడటం మనందరికీ చాలా కామన్‌!! అదే అన్నింటికీ మంచిదంటున్నారు ఇయాన్‌ లెస్లీ అనే రచయిత. ఆ కథేంటో చూద్దాం!!

అన్నీ అబద్ధాలే!!
 వయసు దాచుకోవడానికి కొందరు ఆడవారు... మగువలను వలలో వేసుకోవడానికి కొందరు మగవారు.. అబద్ధాలు చెప్పడంలో దిట్టలే! పొరిగింటావిడ నిన్న కొన్న కొత్త డ్రెస్‌ రేటు ఎంత అని అడిగితే.. మరో రెండొందలు ఎక్కు వేసుకుని చెప్పుకునే కాలేజ్‌ అమ్మాయి, వచ్చిన కట్నానికి 2 ఎకరాలు కలుపుకుని బంధు మిత్రులకు చెప్పుకునే పెళ్లికొడుకు తల్లి, మెడలో ఉన్న నెక్లెస్‌ బాగుందని పొగిడితే.. అసలు బంగారానికి మరో తులం కలుపుకుని చెప్పుకునే షావుకారుగారి భార్య.. ఇలా అసత్యావాదులు రోజుకు చాలా మంది తారసపడుతుంటారు.

అబద్ధమే మిన్న!
నిజం కన్నా అబద్ధమే మిన్న అంటున్నాడు ఇయాన్‌ లెస్లీ అనే రచయిత. ’వై లయింగ్‌ కెన్‌ యాక్చువల్లీ బీ గుడ్‌ ఫర్‌ యూ’ అనే పుస్తకంలో అబద్ధమనేది మనిషి మనుగడకు ఎంతో అవసరమని రాసుకొచ్చాడు. అందుకు సర్వేలు, లెక్కలు ఆధారంగా చూపిస్తున్నాడు. అబద్ధమాడితే ఆరోగ్యం కుదుటపడుతుందని, అసత్యం చెబితే ఆయా రంగాల్లో వ్యక్తిగతంగా ఎదుగుతారని ఏవేవో ఉపయోగాలను చెప్పుకొచ్చాడు. ఓ ప్రాణాంతక వ్యాధికి అబద్ధపు ఆపరేషన్‌ చేస్తే.. ఆ వ్యక్తి రికవర్‌ అయిన ఓ సైంటిఫిక్‌ ఉదంతాన్ని కూడా అతడు ప్రస్తావించాడు.అబద్ధాల గురించి కొన్ని నిజాలు 147 మందిపై జరిపిన ఓ సర్వేలో... ఒక వారం రోజుల పాటు వాళ్లు ఎంతమందికి ఎన్ని అబద్ధాలు చెప్పారో డైరీలో నోట్‌ చేయమని చెప్పారు. ఈ సర్వే ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకి సగటున రెండు సార్లు అబద్ధమాడుతున్నాడని తేలింది.

ఆయన ఆనాడే చెప్పాడు!
బలి చక్రవర్తి కథ తెలుసు కదా! బలి ప్రాణాలు కాపాడేందుకు శుక్రచార్యుడు నానా విధాలా ప్రయత్నించి.. తన కన్ను కూడా పోగొట్టుకుంటాడు. ఈ సమయంలోనే ఓ పద్యం చెబుతాడు.‘వారిజాక్షులందు వైవాహికములందుప్రాణవిత్త మాన భంగమందుజకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము పొందదధిప!’ దీని అర్థం ఏంటంటే.. ఆడవారి విషయంలో, పెళ్లిళ్లు జరిపించడంలో, ధన మాన ప్రాణాలను కాపాడుకోవడంలో.. ఆవుల సంరక్షణలో.. అబద్ధం ఆడవచ్చని, దానివల్ల ఎలాంటి పాపం అంటదని బలికి హితబోధ చేస్తాడు శుక్రచార్యుడు.

సువార్తే!!
ఎట్టిపరిస్థితుల్లోనూ అసత్యమాడరాదన్నారు మన మహాత్ముడు. ఆచరణలో తనను మించిన వారే లేరని నిరూపించారు çసత్య హరిశ్చంద్రుడు. ఇరువురూ చరిత్రలో నిలిచినవారే! కానీ ఈ సర్వే ’చరిత్రలో నిలిచేందుకు కాదు! స్వతహాగా గెలిచేందుకట!!’ మొత్తానికి అసత్య హరిశ్చంద్రులకు ఇది నిజంగా ఏక్‌దమ్‌ గుడ్‌ న్యూసే కదూ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement