సిన్సియర్ పోలీస్
ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన శ్రీకాంత్ మరోసారి లాఠీ ఝుళిపించనున్నారు. శ్రీకాంత్, నిఖిత జంటగా సతీశ్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన ‘టై’ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది.
నిర్మాత మాట్లాడుతూ- ‘‘శ్రీకాంత్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రంగా నిలుస్తుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథే ఈ చిత్రం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి, సమర్పణ: షేక్ కరీమా.