ప్రస్తుత ఉద్యోగులు సక్రమంగా సేవలందించలేకపోతున్నారన్న నెపంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. సొంత వారికి ఏజెన్సీలను కట్టబెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోగ్య మిత్ర ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
రోడ్డున పడనున్న ఆరోగ్య మిత్ర ఉద్యోగులు
Published Wed, Jan 20 2016 2:34 PM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య మిత్ర ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త నియామకాలకు అనుమతిస్తూ జీవో-28 ను జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త ఏజెన్సీ ల నియామకానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు నియమించింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 13 జిల్లాల్లోని దాదాపు 7 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.
ప్రస్తుత ఉద్యోగులు సక్రమంగా సేవలందించలేకపోతున్నారన్న నెపంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. సొంత వారికి ఏజెన్సీలను కట్టబెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోగ్య మిత్ర ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుత ఉద్యోగులు సక్రమంగా సేవలందించలేకపోతున్నారన్న నెపంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. సొంత వారికి ఏజెన్సీలను కట్టబెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోగ్య మిత్ర ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఏపీ సచివాలయంలో బుధవారం ఆరోగ్య మిత్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. మంత్రి కామినేనిని కలిసేందుకు ఇప్పటికే ఉద్యోగులు అపాయింట్మెంట్ తీసుకున్నారు. కానీ, బుధవారం చివరి నిమిషంలో అపాయింట్మెంట్ను మంత్రి కామినేని రద్దు చేశారు. దీంతో ఉద్యోగులు ప్రిన్సిపల్ సెక్రటరీతో భేటీ అయ్యారు. ప్రభుత్వం నిర్ణయంతో తామేమీ చేయలేమని పూనం మాలకొండయ్య ఉద్యోగులకు స్పష్టం చేశారు.
Advertisement
Advertisement