
ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు!
విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలోఉత్తర తమిళనాడు తీరానికి సమీపం అల్పపీడనం బలంగా కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది.
ఉత్తర కోస్తాలో కూడా చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ కోస్తాలో గంటకు 50 -55 కిలోమీటర్ల వేగంతో...ఉత్తర కోస్తాలో గంటకు 45 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. చేపల వేటకు వెళ్ల వద్దని దక్షిణకోస్తాలోని మత్స్యకారులకు హెచ్చరించింది. అలాగే అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కోస్తాలోని మత్స్యకారులకు సూచించింది.