కీలకపత్రాలు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం
హైదరాబాద్: నిమ్స్ మాజీ డెరైక్టర్ ధర్మ రక్షక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ఏసీబీ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో 15 మంది పోలీసుల బృందం ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించి కీలకపత్రాలను, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. 2013లో నిమ్స్‌లో నూతనంగా నిర్మించిన బ్లాక్‌లో పరికరాల కొనుగోలులో రూ.3 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో దాని ఆధారంగా బుధవారం ధర్మరక్షక్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. అలాగే మాజీ అదనపు సంచాలకుడు ముకుందరెడ్డి, ఫైనాన్షియల్ డెరైక్టర్ శ్రీధర్ తదితరులతో పాటు మరో ఇద్దరు అధికారుల ఇళ్లపైన ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీధర్ ఇంటిపై దాడి చేసి హయత్‌నగర్ కుంట్లూరులో రెండు ఓపెన్ ప్లాట్లు, మొయినాబాద్‌లో రెండు ఒపెన్ ప్లాట్లు, అశోక్‌నగర్‌లో ప్లాట్‌లకు సంబంధించిన డ్యాకుమెంట్లను, స్వీప్ట్ డిజైనర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిమ్స్ పరికరాల కొనుగోలులో కమిటీ సిఫారసులను పక్కనబెట్టి ఎక్కువ మొత్తానికి వీటిని కొనుగోలు చేయడం వల్ల ఆస్పత్రికి భారీ నష్టాలు వాటిల్లినట్లు ఫిర్యాదులు అందాయని రవికుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలు ధృవపత్రాలను స్వాధీనం చేసుకొని వాటిని పరిశీలిస్తున్నట్లు.. ఈ అక్రమాల్లో ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు.
తప్పుడు ఆరోపణలు..: నిమ్స్ నూతన బ్లాక్‌లో టెక్నికల్ ఎవాల్యూయేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే పరికరాల కొనుగోలు జరిగిందని ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని... కావాలని తనను ఇందులో ఇరికించారని నిమ్స్ మాజీ డెరైక్టర్ ధర్మరక్షక్ ఆరోపించారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. గత 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వైద్యుడిగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.
నిమ్స్ మాజీ డెరైక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
Published Fri, Nov 6 2015 2:03 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement