
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనుబంధ సంఘం భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్(బీఎంఈయూ) అభ్యర్థి కె.శంకర్ గెలుపొందారు. అధికార టీఆర్‌ఎస్–కేవీ అనుబంధ సంఘమైన జీహెచ్‌ఎంఈయూ అభ్యర్థి యు.గోపాల్‌పై 1,317 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మొత్తం 5,570 మంది ఓటర్లకుగాను 4,264 ఓట్లు పోలయ్యాయి. బీఎంఈయూ కు 2,482 రాగా, జీహెచ్‌ఎంయూకి 1,165 ఓట్లు లభించాయి. దాదాపు 300 ఓట్ల వరకు గల్లంతయ్యాయనే ప్రచారం జరిగింది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామానంతరం తిరిగి బీఎంఈయూ గెలుపొందడంతో కార్మికులు సంబరాలు చేసుకున్నారు.
టీఆర్‌ఎస్‌కేవీకి అనుబంధంగా జీహెచ్‌ఎంసీలో మూడు యూనియన్లుండటం, రెండు యూనియన్ల వారు తప్పనిసరి పరిస్థితుల్లో జీహెచ్‌ఎంఈయూకు మద్దతివ్వడం వంటివి బీఎంఈయూకు కలసి వచ్చాయని భావిస్తున్నారు. మరోవైపు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని బీఎంఈయూ కంటెంప్ట్ వేసిన నేపథ్యంలో అనివార్య పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించినట్లు ఆ యూనియన్ పేర్కొంది. ఐఎన్‌టీయూసీ అనుబంధ సంఘం మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్‌కు 354 ఓట్లు లభించాయి.
మొత్తం ఓట్లు: 5,570
పోలైన ఓట్లు: 4,264
బీఎంఈయూ: 2,482
జీహెచ్‌ఎంఈయూ: 1,165
జీహెచ్‌ఎంఈడబ్ల్యూయూ: 194
చెల్లని ఓట్లు: 69
Comments
Please login to add a commentAdd a comment