
దర్శకుడు యోగి అసభ్యంగా ప్రవర్తించాడు: హీరోయిన్
హైదరాబాద్: పాప సినిమా వివాదంలో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ సినిమా హీరోయిన్ అనుకృతి.. దర్శకుడు యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. యోగి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అనుకృతి ఆరోపిస్తోంది.
ఈ సినిమా నుంచి అనుకృతి అర్ధాంతరంగా తప్పుకుందని యోగి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా పాప సినిమాలో తన పాత్ర డైలాగ్స్ అసభ్యంగా ఉన్నయని, ఇవి తన ఇమేజ్ ను దెబ్బతీస్తాయని హీరోయిన్ అనుకృతి చెప్పింది. దీనిపై యోగి స్పందిస్తూ.. షూటింగ్ మొదలుకావడానికి ముందే హీరోయిన్ అనుకృతికి స్క్రిప్ట్, డైలాగ్స్ వినిపించామని, వాటిలో ఎలాంటి అసభ్యత లేదని, మొదట ఒప్పుకొని షూటింగ్ మధ్యలో ఇలా తప్పుకోవడం దారుణమని అన్నాడు.