
బ్యాంకు పనులున్నాయా.. త్వరపడండి!
హైదరాబాద్: బ్యాంకుల్లో లావాదేవీలు చేయాలనుకునే వారు త్వరపడండి. ఎందుకంటే బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈనెల 25న బక్రీద్, 26న నాలుగవ శనివారం, 27 ఆదివారం కావడంతో బ్యాంకులు తెరుచుకోవు. ప్రతి నెల నాలుగవ శనివారం బ్యాంకులకు సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక అక్టోబర్ నెలాఖరుల్లో బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. 21న ఆయుధపూజ, 22న విజయదశమి, 23న మొహరం, 24న నాలుగవ శనివారం, 25న ఆదివారం కావడంతో బ్యాంకు లావాదేవీలు ఉండవని చెబుతున్నారు. కానీ రిజర్వు బ్యాంకు రెండు రోజులు మాత్రమే సెలవుయిచ్చింది. 22న దసరా, 24న మొహరం సెలవు ప్రకటించింది.