ప్రైడ్‌ ఇండియావి అక్రమ విల్లాలు | Illegal villas of Pride India | Sakshi
Sakshi News home page

ప్రైడ్‌ ఇండియావి అక్రమ విల్లాలు

Published Thu, Jun 8 2017 3:32 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

ప్రైడ్‌ ఇండియావి అక్రమ విల్లాలు - Sakshi

ప్రైడ్‌ ఇండియావి అక్రమ విల్లాలు

- కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిర్మించినట్లు హెచ్‌ఎండీఏ చెబుతోంది
హైకోర్టుకు రిజిస్ట్రార్‌ నివేదిక.. విచారణ 20కి వాయిదా 
 
సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని దేవతల గుట్టపై ప్రైడ్‌ ఇండియా సంస్థ నిర్మించిన విల్లాలన్నీ హెచ్‌ఎండీఏ అధికారుల ప్రకారం న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా నిర్మించినవేనని హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌) వెంకటేశ్వరరెడ్డి హైకోర్టుకు నివేదించారు. తమ నుంచి అను మతులు తీసుకోకుండానే వీటిని నిర్మించి నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు నిర్థారిం చారని ఆయన కోర్టుకు వివరించారు. దేవ తలగుట్టపై ప్రైడ్‌ ఇండియా నిర్మాణాలపై పూర్తి వివరాలతో తన నివేదికను ఆయన కోర్టు ముందుంచారు.

ఈ నివేదికను కేసులో ప్రతివాదులుగా ఉన్న పలువురు వ్యక్తులకు అందజేసేందుకు వీలుగా న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్త ర్వులు జారీ చేసింది. దేవ తలగుట్టపై ఉన్న వీరభద్ర స్వామి, ఇతర దేవాలయా లను కూల్చివేయడమే కాక 150 ఎకరాల ప్రభుత్వ భూమి లో ప్రైడ్‌ ఇండియా బిల్డర్స్‌ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతోందని, దీనిపై అ«ధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ దేవతలగుట్ట పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు నాంరామ్‌రెడ్డి హైకోర్టులో  పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం నిజానిజాలను తేల్చే బాధ్య తలను హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) వెంకటేశ్వరరెడ్డికి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన దేవతలగుట్టను సందర్శించి పూర్తిస్థాయి నివేదికను ధర్మా సనం ముందుంచారు. ఈ నివేదికపై అభ్యంతరాలను తెలిపేందుకు వీలుగా నివేదిక కాపీలను వ్యాజ్యంలో ప్రతివాదు లుగా ఉన్న వారికి అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement