హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ మొదలైనా మే నెల ఎండల తీవ్రత ఆగలేదు. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 44.4, ఆదిలాబాద్, హన్మకొండలో 44.3 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పినా ప్రభావం పెద్దగా కనిపించలేదు. తెలంగాణలో నాలుగు చోట్ల మాత్రమే ఒక సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. అయినా వచ్చే రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.