
బాబు వచ్చారు.... జాబే రాలేదు - టీడీపీ ఎమ్మెల్యే
నాంపల్లి: ఏపీలో ‘బాబు వస్తే..జాబు వస్తుందని’ ప్రచారం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. ఏపీపీఎస్సీ ప్రకటించనున్న గ్రూపు-1 సర్వీసుల్లో గ్రూపు-2 సర్వీస్‌లను విలీనం చేయరాదని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే కృష్ణయ్య మట్లాడుతూ గ్రూపు-1 సర్వీస్‌లో గ్రూపు-2 సర్వీసులను విలీనం చేయడం అశాస్త్రీయమన్నారు.
ఇంటర్వూల పేరుతో లక్షలు దండుకునేందుకే అధికారులు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఒక 1.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాల ప్రశ్నాపత్ర ం ఇంగ్లీషుతో పాటుగా తెలుగులో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... నిరుద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, చంద్రబాబైనా... చంద్రశేఖరైనా నిలదీస్తామన్నారు. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్‌తో కృష్ణయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. సమస్యపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ైచైర్మన్ హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, పులకచర్ల శ్రీనివాస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.