
నేడు పీవీ స్మారక ఉపన్యాసం
సిటీబ్యూరో: ఎమెస్కో పుస్తక సంస్థ ఆధ్వర్యంలో గురువారం మాజీ ప్రధాని పీవీ స్మారకోపన్యాస కార్యక్రమం జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు బేగంపేట్‌లోని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్‌లో జరిగే ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ సభ్యులు జైరాం రమేష్ ‘పీవీ ఇన్ పర్‌స్పెక్టివ్’ అనే అంశంపై స్మారక ప్రసంగం చేస్తారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ సభకు అధ్యక్షత వహిస్తారు.
ఈ సందర్భంగా జైరాం రమేష్ రచించిన ‘సంస్కరణల రథసారధి పి.వి.’ అనేగ్రంథాన్ని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ఆవిష్కరిస్తారు. సురభి వాణీదేవి, సీనియర్ పాత్రికేయులు ఎ.కృష్ణారావు పాల్గొం టారని ఎమెస్కో పుస్తక సంస్థ ప్రతి నిధి విజయ్‌కుమార్ తెలిపారు. పంజగుట్టలోని అగర్వాల్ కంటి ఆసుపత్రిని ఆనుకొని ఉన్న మార్గంలో చివరి వరకు వెళితే సెస్ క్యాంపస్‌కు చేరుకోవచ్చు.