Memorial lecture
-
అందరికీ వృద్ధి ఫలాలు అందడమే అసలైన అభివృద్ధి
న్యూఢిల్లీ: సమ్మిళిత వృద్ధి (అందరికీ వృద్ధి ఫలాలు చేరేలా) లేకుండా అసలైన వృద్ధి సాధ్యపడదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు ఈ దిశగా తీసుకున్నట్టు చెప్పారు. తొలిసారిగా అరుణ్‌జైట్లీ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. ప్రైవేటు రంగాన్ని వృద్ధిలో భాగస్వామిగా చూస్తున్నట్టు చెప్పారు. సమ్మిళిత వృద్ధి కోసం తీసుకున్న చర్యలను వివరిస్తూ.. ‘‘9 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం. 10 కోట్ల టాయిలెట్లను ప్రభుత్వం నిధులతో నిర్మించాం. 45 కోట్ల బ్యాంకు ఖాతాలను పేదల కోసం తెరిచాం. 2014కు ముందు పదేళ్లలో 50 వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా, గత 7–8 ఏళ్లలో 209 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి’’అని చెప్పారు. భారత్ తప్పనిసరి అయి సంస్కరణలు చేపట్టడం లేదని స్పష్టం చేస్తూ.. తదుపరి 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని దృఢ విశ్వాసంతో అమలు చేస్తున్నట్టు తెలిపారు. సంస్కరణలు అందరికీ ఫలాలను ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ బీజేపీ నేత అయిన అరుణ్‌జైట్లీకి ప్రధాని నివాళులు అర్పించారు. -
చట్టసభల్లో నిరసనకు హద్దులుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో నిరసనలు తెలపడంలో తప్పు లేదని, అదే సమయంలో సభా గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాల్లోని లోపాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజా ప్రతినిధుల హక్కు అయినప్పటికీ, అవి భావోద్వేగాలకు దారి తీసి పరిమితులు దాటకూడదని హితవు పలికారు. చట్టసభల్లో కార్యకలాపాలకు తరచూ అంతరాయాలు కలుగుతుండటం, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితులు చోటు చేసుకోవడంపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలి స్మారకోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో అంతరాయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రణబ్ ముఖర్జీ లెగసీ ఫౌండేషన్ వర్చువల్ వేదికగా నిర్వహించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని, సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. చట్టసభల్లో అంతరాయాలతో జవాబుదారీతనం కొరవడి, ఏకపక్ష ధోరణి ఏర్పడే ప్రమాదముందని ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ బుద్ధి కుశలత, అసాధారణ జ్ఞాపకశక్తి అనేక వివాదాస్పద అంశాలకు సమాధానాన్ని చూపిందన్న ఉపరాష్ట్రపతి, పన్ను సంస్కరణలను స్వయంగా ఆర్థికమంత్రిగా సేవలందించిన ప్రణబ్ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో నాగపూర్‌లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. శిక్షణా శిబిరంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, హుందాగా వ్యవహరించగల ప్రణబ్ వ్యక్తిత్వానికి ఇది ఉదాహరణ అన్నారు. జాతీయవాదం గురించి మాటల్లో చెప్పే వారికి, నిజమైన జాతీయవాదాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రణబ్ విశేష సేవలు: మోదీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దార్శనికతగల గొప్ప నేత అని ప్రధాని మోదీ శ్లాఘించారు. అత్యుత్తమ ప్రజాజీవితం, పరిపాలనా దక్షత, సునిశిత దృష్టి కలిగిన ఆయన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రథమ స్మారకోపన్యాసంలో ప్రధాని ఈ మేరకు పేర్కొన్నారు. అమోఘ ప్రజ్ఞాపాటవాలు కలిగిన ప్రణబ్ దేశాభివృద్ధికి గుర్తుంచుకోదగ్గ సేవలందించారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య విలువలను ఆయన పరిపుష్టం చేశారన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ఖలీదా జియా వర్చువల్‌గా ప్రసంగించారు. యువ ఎంపీగా బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పాటునందిం చారని ప్రణబ్‌ను కొనియాడారు. బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ 1971 జూన్‌లో రాజ్యసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తుకు తెచ్చుకున్నారు. భూటాన్ రాజు జింగ్మే కేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ తన ఉపన్యాసంలో.. ప్రణబ్‌తో పలుమార్లు తాను భేటీ అయ్యాయని చెప్పారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాననీ, ఆయన లోటు తీర్చలేనిదని తెలిపారు. ప్రణబ్‌ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012–17 మధ్య కాలంలో పనిచేశారు. కాంగ్రెస్ నేత అయిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. -
చట్టాలపై అవగాహనతోనే సమర్థ పోలీసింగ్
రాజేంద్రనగర్: నిరంతరం శిక్షణ, చట్టాలపై సంపూర్ణ అవగాహనతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పైజాన్‌ముస్తఫా అన్నారు. రాజ్యాంగం, మానవ హక్కులు, పోలీసింగ్ అనే అంశంపై హిమాయత్‌సాగర్‌లోని రాజా రామ్బహద్దూర్ వెంటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో సోమవారం ‘కె.ఎస్.వ్యాస్ 24వ స్మారక ఉపన్యాస’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫైజన్ ముస్తఫా మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లోని పోలీసులు అతితక్కువ బడ్జెట్ కేటాయింపుల వల్ల సరైన శిక్షణ లేక ఒత్తిడితో పని చేస్తున్నారన్నారు. దేశంలో పోలీసు విభాగాల్లో సుమారు ఐదున్నర లక్షల ఖాళీలున్నాయన్నారు. మొత్తం పోలీస్ వ్యవస్థలో 86% కానిస్టేబుళ్ల స్థాయి సిబ్బంది ఉండగా, 13% మంది ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ వారు ఉన్నారని తెలిపారు. పోలీసు సిబ్బందితో పాటు ఇన్స్పెక్టర్, ఎస్సైలకు నిరంతరం మానవ హక్కులు, న్యాయ, చట్ట పరమైన అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారులకు, యువతకు ఇప్పటికీ దివంగత వ్యాస్ రోల్ మోడల్‌గా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ వి.కె.సింగ్, దివంగత వ్యాస్ కుమారుడు సీసీ ఎల్ఏ అడిషనల్ కమిషనర్ కేఎస్ శ్రీవత్స తదితరులు పాల్గొన్నారు. -
దేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది : గవాస్కర్
ముంబై : పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. శనివారం మాజీ ప్రధాని లాల్ బహుదూర్‌శాస్త్రి 26వ మొమోరియల్ లెక్చర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవాస్కర్ హాజరయ్యరు. 'ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉంది. తరగతి గదుల్లో ఉండాల్సిన కొందరు విద్యార్థులు రోడ్లపై కనిపిస్తున్నారు. వీరిలో కొందరు ఆందోళన చేస్తూ ఆసుపత్రుల పాలవుతున్నారు.మనం అందరం భారతీయులుగా కలిసి ఉన్నప్పుడే దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చు. దేశంలో వచ్చే ఏ సంక్షోభాన్ని అయినా దైర్యంగా ఎదుర్కొనగలుగుతాం. మేము క్రికెట్ ఆటలో కూడా ఎన్నో సంక్షోభాలు చవిచూశాం. కానీ మేమంతా ఆ సమయంలో ఒక జట్టుగా కలిసి ముందుకు సాగడం వల్లే ఆటలో అనేక విజయాలు సాధించగలిగామని' గవాస్కర్ పేర్కొన్నాడు. పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఢిల్లీలోని జేఎన్‌యూ, జామిమా మిలియా యునివర్సిటీ, దేశవ్యాప్తంగా పలు యునివర్సిటీలు సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగించిన సంగతి విదితమే. #WATCH Sunil Gavaskar: Country is in turmoil. Some of our youngsters are out in streets instead of being in classrooms&some of them are ending up in hospitals for being out on streets. Admittedly, majority is still in classrooms trying to forge career&to build&take India forward. pic.twitter.com/4Er3jGoqf2 — ANI (@ANI) January 11, 2020 -
నేడు పీవీ స్మారక ఉపన్యాసం
సాక్షి, హైదరాబాద్: భారత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం పీవీ స్మారక ఉపన్యాసం నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.37లోని దసపల్లా హోటల్లో ఉదయం 11గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి నేతృత్వంలో జరిగే ఈ సభలో ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు శేఖర్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని పీవీ స్మారక ప్రసంగం చేయనున్నారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించనున్న ఈ కార్యక్రమానికి సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు హాజరవనున్నారు. -
తెలంగాణ సాయుధపోరుకు మలుపు బి.ఎన్.
తెలంగాణలో భూమి, భుక్తి, విముక్తి కోసం 1947–51 వరకు జరిగిన సాయుధపోరాటం మూడు వేల గ్రామాల్ని ప్రభావితం చేసింది. ఈ పోరాటానికి ముందుగా నిజాం రాష్ట్రంలో ఆర్యసమాజం అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. వారి ఉద్యమమే క్రమంగా కమ్యూనిస్టుల పోరాటంగా మారింది. అదే చివరకు సాయుధపోరాటం అయ్యింది. ఆనాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగమైన జనగామ పిర్కాలో విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ బువ్వగింజల పోరాటం చేసింది. పండిన పంటను కల్లాల దగ్గర్నుంచి తీసుకుపోవడానికి విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు అడ్డుపడ్డారు. చాకలి ఐలమ్మ ప్రతిఘటించింది. ఇదే చరిత్రకు మలుపు. ఈ మలుపు దగ్గర్నుంచి ఒక సింహంలా దూసుకొచ్చిన యోధుడు విసునూరు రామ చంద్రారెడ్డి గూండాలను పారిపోయేటట్లు చేశాడు. ఆ వడ్ల గింజల బస్తాను భుజం మీద వేసుకుని బండ్ల పైకి ఎక్కించి చాకలి ఐలమ్మ ఇంటికి ఆ బువ్వగింజల్ని పంపించాడు. ఆ యోధుడే భీమిరెడ్డి నర్సింహారెడ్డి. అప్పటికే జనగామ పిర్కాలో ఆనాటి భూస్వాములకు వ్యతిరేకంగా సంఘాలు ఏర్పడ్డాయి. దేవరుప్పలలో తొలిసారిగా దేవులపల్లి వేంకటేశ్వరరావు నాయకత్వంలో గుతపలు తీసుకుని ఎదురుతిరిగారు. చరిత్రలో దాని పేరు గుతపల సంఘమైంది. ఐలమ్మ బువ్వగింజల పోరాటం నుంచి పిడికిలి బిగించిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి సాయుధపోరాటాన్ని విరమించేంత వరకు వెనుతిరిగి చూడకుండా పోరాడిన యోధుడు. గుతపల సంఘంతో పాటు గ్రామీణ ప్రాంతంలో రైతులను సమీకరించి వారికి అందుబాటులో ఉన్న వనరులని ఆయుధాలుగా మలిచి భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి భీమిరెడ్డి. కోటపాడు గ్రామంలో గడ్డివాములను తగులబెట్టి పొగబాంబులుగా మార్చి నిజాం పోలీసు, సైనికదళాలని మట్టు పెట్టిన ఘనుడు ఆయన. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో సాయుధపోరాటానికి రూపకల్పన చేసిన మిలిటరీ వ్యూహకర్త. నాలుగేళ్లు కొనసాగిన సాయుధపోరాటంలో భీమిరెడ్డి ఏనాడు కూడా వెనకకు పోలేదు. చిత్రహింసలను అనుభవించాడు. అయినా ఎత్తిన తుపాకీ దించలేదు. తెలంగాణలో లక్షలాది ఎకరాల భూమిని భూస్వాములనుంచి లాక్కొని పేదలకు పంచటంలో కమ్యూనిస్టులు ప్రజలకు చేరువయ్యారు. ఈ పోరాటంలోనే శత్రువుపై పోరాడుతూ భీమిరెడ్డి తన చేతులో ఉన్న కొడుకును కూడా వదిలేసి వెళ్లిపోయాడు. బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవు కొడుకో నైజాం సర్కరోడా అని పాట కట్టిన బండి యాదగిరికి కొండంత అండగా నిలిచినవాడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి. తన పోరాటమంతా గిరిజనులు, బహుజనుల చుట్టే తిరిగింది. ప్రధానంగా ఈ పోరాటమంతా భూసమస్య చుట్టూ తిరిగింది. కాబట్టే చదువురాని నిరక్షరాస్యులైన ఆ మూగజీవాలను మహాయోధులుగా మార్చి పోరా టం చేయించిన చరిత్ర తెలంగాణ సాయుధపోరాటానికే దక్కుతుంది. ఆ ఖ్యాతిలో భీమిరెడ్డి చరిత్ర చెరిగిపోనిది. భీమిరెడ్డి దళ నాయకుడిగా వందల సంఘటనల్లో పాల్గొన్నాడు. శత్రువుతో ముఖాముఖి యుద్ధాలకు తలపడ్డాడు. ఆనాటి సంఘం చెప్పిన మాటను జవదాట కుండా పనిచేశాడు. అందుకే భీమిరెడ్డిని తెలంగాణ క్యాస్ట్రో అంటారు. (నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నేడు బీఎన్ తొలి స్మారక ఉపన్యాసం) – ప్రొ‘‘ అడపా సత్యనారాయణ (రిటైర్డ్), ఉస్మానియా యూనివర్శిటీ -
ఏయూలో పీవీ ఐదవ స్మారకోపన్యాసం
-
నేడు పీవీ స్మారక ఉపన్యాసం
సిటీబ్యూరో: ఎమెస్కో పుస్తక సంస్థ ఆధ్వర్యంలో గురువారం మాజీ ప్రధాని పీవీ స్మారకోపన్యాస కార్యక్రమం జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు బేగంపేట్‌లోని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్‌లో జరిగే ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ సభ్యులు జైరాం రమేష్ ‘పీవీ ఇన్ పర్స్పెక్టివ్’ అనే అంశంపై స్మారక ప్రసంగం చేస్తారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ రచించిన ‘సంస్కరణల రథసారధి పి.వి.’ అనేగ్రంథాన్ని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ఆవిష్కరిస్తారు. సురభి వాణీదేవి, సీనియర్ పాత్రికేయులు ఎ.కృష్ణారావు పాల్గొం టారని ఎమెస్కో పుస్తక సంస్థ ప్రతి నిధి విజయ్‌కుమార్ తెలిపారు. పంజగుట్టలోని అగర్వాల్ కంటి ఆసుపత్రిని ఆనుకొని ఉన్న మార్గంలో చివరి వరకు వెళితే సెస్ క్యాంపస్‌కు చేరుకోవచ్చు. -
రాహుల్ ద్రావిడ్ లెక్చర్...