రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే | 2016 Nobel Prize in Chemistry | Sakshi
Sakshi News home page

రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే

Published Wed, Oct 5 2016 5:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే

రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే

స్టాక్హోం: 2016 రసాయన శాస్త్ర నోబెల్ ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. ఫ్రాన్స్కు చెందిన జీన్ పియరి సావేజ్, ఫ్రేజర్ స్టొడార్ట్(స్కాట్లాండ్), నెదర్లాండ్స్ శాస్త్రవేత్త బెర్నార్డ్ ఫెరింగా లు మాలిక్యులార్ మెషిన్స్ అంశంలో చేసిన కృషికి గాను నొబెల్ దక్కింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ సూక్ష్మ యంత్రాల తయారీలో నిర్వహించిన పరిశోధనలకు దక్కిందని బుధవారం అవార్డు ప్రకటన సందర్భంగా రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.

సెన్సార్లు, ఎనర్జీ స్టోరేజ్ పరికరాలు లాంటి సూక్ష్మ యంత్రాల తయారికి సహకరించే విధంగా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మాలిక్యులార్ మెషిన్స్ అంశంలో పరిశోధనలు నిర్వహించారు. ఈ అవార్డు కింద వీరికి 8 మిలియన్ల స్వీడిష్ క్రౌన్లు దక్కనున్నాయి.
 

Advertisement
Advertisement