2020 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతి విజేతలను స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. వీటిలో మహిళలు తమ సత్తా చాటారు. రసాయన శాస్త్ర విభాగానికి సంబంధించి ఈ బహుమతి ఇద్దరు మహిళలను వరించింది. ఫ్రెంచ్ ప్రొఫెసర్ ఎమ్మాన్యుయెల్ చార్పెంటియర్‌కు, అమెరికన్ బయోకెమిస్ట్ జెన్నిఫర్ దౌడ్నాకు ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కింది. జినోమ్ మార్పులపై చేసిన పరిశోధనలకుగాను వీరికి నోబెల్ అవార్డు వరించింది. ఇక ఇప్పటికే భౌతిక శాస్త్రంలో ముగ్గురు, వైద్య రంగంలో ముగ్గురుకు నోబెల్ బహుమతి దక్కిన సంగతి తెలిసిందే. ఇక నోబెల్ శాంతి బహుమతిని అక్టోబర్ 9వ తేదీన ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి రేసులో ఆప్ఘనిస్తాన్‌కు చెందిన ఫాజియా కూఫీ ఉన్నారు. చదవండి: భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్
Comments
Please login to add a commentAdd a comment