chemistry nobel
-
నోబెల్ ప్రైజ్, సత్తా చాటిన మహిళలు
2020 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతి విజేతలను స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. వీటిలో మహిళలు తమ సత్తా చాటారు. రసాయన శాస్త్ర విభాగానికి సంబంధించి ఈ బహుమతి ఇద్దరు మహిళలను వరించింది. ఫ్రెంచ్ ప్రొఫెసర్ ఎమ్మాన్యుయెల్ చార్పెంటియర్‌కు, అమెరికన్ బయోకెమిస్ట్ జెన్నిఫర్ దౌడ్నాకు ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కింది. జినోమ్ మార్పులపై చేసిన పరిశోధనలకుగాను వీరికి నోబెల్ అవార్డు వరించింది. ఇక ఇప్పటికే భౌతిక శాస్త్రంలో ముగ్గురు, వైద్య రంగంలో ముగ్గురుకు నోబెల్ బహుమతి దక్కిన సంగతి తెలిసిందే. ఇక నోబెల్ శాంతి బహుమతిని అక్టోబర్ 9వ తేదీన ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి రేసులో ఆప్ఘనిస్తాన్‌కు చెందిన ఫాజియా కూఫీ ఉన్నారు. చదవండి: భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ -
రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే
స్టాక్‌హోం: 2016 రసాయన శాస్త్ర నోబెల్ ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. ఫ్రాన్స్‌కు చెందిన జీన్ పియరి సావేజ్, ఫ్రేజర్ స్టొడార్ట్(స్కాట్లాండ్), నెదర్లాండ్స్ శాస్త్రవేత్త బెర్నార్డ్ ఫెరింగా లు మాలిక్యులార్ మెషిన్స్ అంశంలో చేసిన కృషికి గాను నొబెల్ దక్కింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ సూక్ష్మ యంత్రాల తయారీలో నిర్వహించిన పరిశోధనలకు దక్కిందని బుధవారం అవార్డు ప్రకటన సందర్భంగా రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. సెన్సార్లు, ఎనర్జీ స్టోరేజ్ పరికరాలు లాంటి సూక్ష్మ యంత్రాల తయారికి సహకరించే విధంగా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మాలిక్యులార్ మెషిన్స్ అంశంలో పరిశోధనలు నిర్వహించారు. ఈ అవార్డు కింద వీరికి 8 మిలియన్ల స్వీడిష్ క్రౌన్లు దక్కనున్నాయి.