బీజింగ్: చైనా పేలుళ్ల మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. రాజధాని బీజింగ్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టియాన్‌జెన్ మున్సిపాలిటిలోని పారిశ్రామికవాడలో భారీ పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. శనివారం రాత్రి మరో పది మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో మృతుల సంఖ్య 112 చేరింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఇంకా 95 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే చనిపోయిన వారిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉండడం మరింత విషాదం. కార్చిచ్చులా చెలరేగుతున్నమంటలను అదుపు చేసే క్రమంలో ఫైర్ ఫైటర్స్ కొంతమంది చనిపోయారు. ఇంకా 85 మంది సిబ్బంది జాడ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు.
కాగా గత వారం సంభవించిన ఈ పేలుడు తీవ్రతకు సమీప దుకాణాల అద్దాలు పగిలిపోయి చాలా దూరం విసిరి వేయబడ్డాయి. దాదాపు 2500 కార్లకు నిప్పు అంటుకోవడం పరిస్థితి విషమంగా తయారైంది. విషపూరితమైన పొగ వెలువడింది. విస్పోటన తీవ్రతకు రెండు కిలోమీటర్ల దూరం వరకు బూడిద వ్యాపించింది. విస్పోటనం స్థాయి తీవ్రంగా ఉండడంతో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. భూకంపం కంటే శక్తి వంతమైన పేలుడుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
చైనాలో పెరుగుతున్న మృతుల సంఖ్య
Published Sun, Aug 16 2015 11:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement