China blasts
-
5,800 ల్యాండ్ రోవర్ కార్లు ధ్వంసం
బీజింగ్: చైనాలోని టియాంజిన్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5800 ల్యాండ్ రోవర్ల కార్లు ధ్వంసమైనట్టు అధికారిక సమాచారం. భారత మాతృసంస్థ అయిన టాటా మోటార్ కంపెనీ 5800 కార్లను ముంబై నుంచి చైనాకు శుక్రవారం ఎగుమతి చేసింది. టియాంజిన్‌లోని వివిధ ప్రాంతాల్లో వీటిని నిల్వ ఉంచారు. దాదాపు 600 మిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చైనాలో పెరుగుతున్న మృతుల సంఖ్య
బీజింగ్: చైనా పేలుళ్ల మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. రాజధాని బీజింగ్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టియాన్‌జెన్ మున్సిపాలిటిలోని పారిశ్రామికవాడలో భారీ పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. శనివారం రాత్రి మరో పది మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో మృతుల సంఖ్య 112 చేరింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇంకా 95 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే చనిపోయిన వారిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉండడం మరింత విషాదం. కార్చిచ్చులా చెలరేగుతున్నమంటలను అదుపు చేసే క్రమంలో ఫైర్ ఫైటర్స్ కొంతమంది చనిపోయారు. ఇంకా 85 మంది సిబ్బంది జాడ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. కాగా గత వారం సంభవించిన ఈ పేలుడు తీవ్రతకు సమీప దుకాణాల అద్దాలు పగిలిపోయి చాలా దూరం విసిరి వేయబడ్డాయి. దాదాపు 2500 కార్లకు నిప్పు అంటుకోవడం పరిస్థితి విషమంగా తయారైంది. విషపూరితమైన పొగ వెలువడింది. విస్పోటన తీవ్రతకు రెండు కిలోమీటర్ల దూరం వరకు బూడిద వ్యాపించింది. విస్పోటనం స్థాయి తీవ్రంగా ఉండడంతో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. భూకంపం కంటే శక్తి వంతమైన పేలుడుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
'నేను తిరిగి రాకుంటే మా డాడీ మీడాడీ అనుకో'
తియాంజిన్: భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న మంటలు ఆ అగ్నిమాపక సిబ్బందిని భస్మం చేశాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ముప్పై మందికి పైగా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఇది చైనాలో చోటుచేసుకున్న ఘటన. తియాంజిన్ పట్టణంలో రసాయన పదార్థాల పేలుళ్లు సంభవించి భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. ఒక పెద్ద హైడ్రోజన్ బాంబు వేశారా ఆ ప్రాంతంలో అన్నంత పెద్దగా మంటలు వ్యాపించాయి. దీంతో వాటిని నిలువరించేందుకు చైనా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. కానీ వారిలో కొందరు దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వారు చెప్తున్న అధికారిక లెక్కల ప్రకారం 21 మంది సిబ్బంది అగ్నికీలలకు ఆహుతి అయ్యారని చెప్తున్నా 36 మంది కనిపించడం లేదని వారంతా అందులోనే చిక్కుకుపోయారని మరికొందరు చెప్తున్నారు. ఇంతపెద్దమొత్తంలో అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం చైనాలో 1949 తర్వాత ఇదే తొలిసారి. మంటల్లో చిక్కుకున్న కొందరు అగ్నిమాపక సిబ్బందిలో కొందరు 'నేను ప్రాణాలతో తిరిగి రాకుంటే మా డాడీ ఇక మీ డాడీ అనుకో.. నాకుటుంబం నీ కుటుంబం అనుకో.. నా స్నేహం మరో జన్మకు కూడా నీతోనే ఉండాలని కోరుకుంటున్నా' అంటూ వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మెస్సేజ్‌లు పంపిచారు.