న్యూయార్క్: భారత ఆధ్యాత్మిక గురువు చిన్మయ కుమార్ ఘోష్ 85వ జయంతిని పురస్కరించుకుని ఆయన శిష్యులు వినూత్నంగా నివాళి అర్పించారు. 45 అడుగుల కేకుపై ఒకేసారి 72 వేల కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. గిన్నిస్ వరల్డ్ చాంపియన్ ఆశ్రిత ఫర్మాన్(61) నేతృత్వంలో ఆగస్టు 27న ఈ కార్యక్రమం నిర్వహించారు. దీన్ని గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదు చేయనున్నారు. దాదాపు 100 మంది కొన్ని గంటల పాటు శ్రమించి కొవ్వొత్తులను లెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో 50 వేల కొవ్వొత్తులు వెలిగించిన రికార్డు దీంతో చెరిగిపోనుంది.
ఆశ్రిత ఫర్మాన్ పేరిట 622 గిన్నిస్ రికార్డులున్నాయి. శ్రీ చిన్మయ్ గా సుప్రసిద్ధులైన చిన్మయ కుమార్ ఘోష్.. న్యూయార్క్ లో మెడిటేషన్ బోధించేశారు. 2007, అక్టోబర్ 11న ఆయన కన్నుమూశారు. మెడిటేషన్, యోగాతో ప్రజల మధ్య సామరస్యం పెంపొందించవచ్చని శ్రీ చిన్మయ్ నమ్మారని భారత్ లోని చిన్మయ్ సెంటర్ల అధ్యక్షుడు అశోక్ పారులేకర్ తెలిపారు.
శ్రీ చిన్మయ్ శిష్యుల గిన్నిస్ రికార్డు
Published Tue, Aug 30 2016 9:37 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
Advertisement
Advertisement