దుబాయ్: పిల్లలతో పాటు పెద్దలు సైతం ఇష్టంగా ఆడుకునే వీడియో గేమ్ల థీమ్తో ఓ పార్క్ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ థీమ్ పార్క్లో స్ట్రీట్ ఫైటర్, మెటల్ గేర్ సాలిడ్, ఫైనల్ ఫాంటసీ లాంటి పాపులర్ గేమ్లలోని క్యారెక్టర్లతో పాటు మరెన్నో వీడియో గేమ్ల దృష్యాలు కనిపించనున్నాయి. 'హబ్ జీరో' పేరుతో మిరాస్ కంపెనీ నిర్మిస్తున్న ఈ వీడియోగేమ్ థీమ్ పార్క్ దుబాయ్లో ఈ సమ్మర్లోనే మొదలవుతోంది.
వీడియో గేమ్ అభివృద్ధి సంస్థలు క్యాప్కామ్, కొనామి, స్క్వేర్ ఎనిక్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వంటి సంస్థలతో ఈ పార్క్ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాన్ని మిరాస్ కుదుర్చుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా వీడియో గేమ్లకు సంబంధించిన ఇండోర్ థీమ్ పార్క్ 'హబ్ జీరో' మంచి ఆధరణ పొందుతుందని మిరాస్ సంస్థ నమ్మకంగా ఉంది. వీడియో గేమ్లపై వినియోగదారులు 2014 సంవత్సరంలో సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని, ఇది సంవత్సరానికి 10 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని మిరాస్ వెల్లడించింది.
వీడియో గేమ్ థీమ్ పార్క్!
Published Mon, Feb 29 2016 12:11 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM
Advertisement