లండన్: గణితంలో ఎంతో కీలకమైన సున్నాను భారతీయులు మూడో శతాబ్దంలోనే విరివిగా వినియోగించారని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. అవిభక్త భారత్‌లోని బక్షాలి గ్రామంలో(ఇప్పటి పాకిస్తాన్‌లో ఉంది) 1881లో ఓ పొలంలో దొరికిన రాతప్రతిని కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు.
ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 9వ శతాబ్దానికి చెందిన ఓ దేవాలయం గోడలపై ఉన్న సున్నాయే ప్రాచీనమని భావించినట్లు పరిశోధనలో పాల్గొన్న ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ మార్కస్ డు సౌటోయ్ వెల్లడించారు. గతంలో పరిశోధకులు బక్షాలి రాతప్రతిని 8 నుంచి 12వ శతాబ్ద కాలానికి చెందినదిగా భావించినట్లు పేర్కొన్నారు. ఈ రాతప్రతిపై మూడు వేర్వేరు కాలాలకు చెందిన పదార్థాలు పేరుకుపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు వెల్లడించారు. కార్బన్ డేటింగ్ ప్రక్రి య ద్వారా ఈ రాతప్రతిని 3వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించామన్నారు.
మూడో శతాబ్దంలోనే భారత్‌లో సున్నా
Published Mon, Sep 18 2017 3:40 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM
Advertisement
Advertisement