ఇంట్లో కూర్చునే ఈ ఓడ ఎక్కేయండి! | this ship sitting at home! | Sakshi
Sakshi News home page

ఇంట్లో కూర్చునే ఈ ఓడ ఎక్కేయండి!

Published Wed, Jul 9 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

ఇంట్లో కూర్చునే ఈ ఓడ ఎక్కేయండి!

ఇంట్లో కూర్చునే ఈ ఓడ ఎక్కేయండి!

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ లైనర్. ‘అల్యూర్ ఆఫ్ ది సీస్’ అని నామకరణం చేసిన ఈ ఓడ పొడవు 1,184 అడుగులు. బరువు 2,22,900 టన్నులు. వేగం గంటకు 41.9 కిలోమీటర్లు. ఇందులో ఒకేసారి 5,400 మంది ప్రయాణించొచ్చు. ఈ క్రూయిజ్‌లో ఉన్న సౌకర్యాలు, విశేషాలు చూస్తే.. ఔరా అనిపించకమానదు. ఓ చిన్న నగరాన్నే తలపించే రీతిలో అన్ని హంగులూ ఇందులో ఉన్నాయి. షాపింగ్ స్ట్రీట్ దగ్గర నుంచి ఐస్ స్కేటింగ్ రింక్ వరకు.. కాఫీ షాప్ నుంచి అత్యాధునిక హంగులున్న భారీ రెస్టారెంట్ వరకు..

సర్ఫింగ్ స్టిమ్యులేటర్, రాక్ క్లైంబింగ్ వాల్, 1,340 సీట్ల సామర్థ్యం గల థియేటర్, స్విమ్మింగ్‌పూల్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఒక్కసారైనా అందులో ప్రయాణించాలని అనిపిస్తోందా? అయితే ఫ్లోరిడా వెళ్లాల్సిందే. అంతదూరం వెళ్లడం కుదరదంటారా? అయితే స్మార్ట్‌ఫోన్‌లోనో లేదా కంప్యూటర్‌లోనో ఓసారి గూగుల్ క్రూయిజ్ వ్యూ ఓపెన్ చేయండి. ఆ ఓడ ఎక్కిన అనుభూతి మీ సొంతం అవుతుంది. మీ ఇంట్లో కూర్చునే క్రూయిజ్ మొత్తాన్ని తిరిగేయొచ్చు. ఇంకెందుకాలస్యం.. ఓ లుక్కేయండి మరి..!
 

Advertisement
Advertisement