మూడు చేపల కథ...
కాలిఫోర్నియాకు చెందిన అర్మాండో, జో, ట్రావిస్‌లో గతవారం వేటకు వెళ్లారు. మూడు చేపలు పట్టారు. వాటిని ఎండబెట్టలేదు గానీ.. ఇలా గొప్పగా ఫొటోకు పోజిచ్చారు. ఎందుకు? ఎందుకంటే.. మూన్ ఫిష్‌గా పిలిచే ఈ చేపలు ఒకటి దొరికితేనే.. అదృష్టమని ఫీలవుతారట. అలాంటిది ఒకేరోజు హ్యాట్రిక్ కొడితే.. మరి ఫొటోకు పోజివ్వరా? పైగా.. దక్షిణ కాలిఫోర్నియా తీర జలాల్లో ఇవి పెద్దగా దొరకవట కూడానూ.. మత్స్యకారులంటే.. సముద్రంలో చాలా దూరం ప్రయాణించి..
పెద్దపెద్ద వలలు వంటివి వేస్తారు కాబట్టి.. వారికి దొరుకుతాయి. వీళ్లు గాలం పట్టుకుని బయల్దేరారు. వాళ్ల బుల్లి గాలానికి ఇంత భారీ చేపలు చిక్కడమంటే మాటలు కాదుగా.. అందుకే ఈ ఫొటోను వారు ఫేస్‌బుక్‌లో పెడితే.. వేలాదిమంది షేర్ చేశారట.