ఇది మలేసియా ‘శుభలగ్నం’.. | Triple triangle love story | Sakshi
Sakshi News home page

ఇది మలేసియా ‘శుభలగ్నం’..

Published Sun, May 21 2017 12:14 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

ఇది మలేసియా ‘శుభలగ్నం’.. - Sakshi

ఇది మలేసియా ‘శుభలగ్నం’..

వేరే మహిళ భర్తని కోటి రూపాయలకు కొనుక్కోవడం జగపతిబాబు, ఆమని, రోజా నటించిన ’శుభలగ్నం’లో చూశాం. డబ్బుపై మోజుతో ఆమని తన భర్త జగపతిబాబును రోజాకు అమ్ముకుంటుంది. అయితే దాదాపు అలాంటి సీన్‌ మలేసియాలో జరిగింది. ఓ యువతి మరొకరి బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమించింది. అతడికి తన వివరాలు చెబుతూ లోబర్చుకోవాలని చూసింది. కానీ ఆమె యత్నాలు ఫలించలేదు. దీంతో అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను వేధించింది, చివరి ప్రయత్నంగా రూ. 1.5 కోట్ల రూపాయలు ఇస్తానని ఆశ చూపింది. డబ్బు కాదు ప్రియుడే ముఖ్యమని చెప్పింది. అందరి మనసులు గెలుచుకుంది. మలేసియాకి చెందిన 38 ఏళ్ల జోసి లీ, డానీ టాన్‌ అనే యువకుడిని ప్రేమించింది.

కానీ డానీ అప్పటికే జోయి టాన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు. అంత వయసున్నా టీనేజ్‌ యువతిగా కనిపించే జోసిది ఒక ధనిక కుటుంబ నేపథ్యం. మొదట్లో డానీతో పరిచయం పెంచుకుంది. ఆపై నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు లేకపోతే నేను ఉండలేనంటూ బాంబు పేల్చింది. తనకు ప్రేయసి ఉందన్న విషయం తెలిసినా జోసి ఇలా చేయడంతో డానీ సీరియస్‌ అయ్యాడు. 20 ఏళ్ల నుంచి మనమిద్దరం కలిసే తిరిగాం, ఇప్పుడేమైంది అంటూ జోసి లేనిపోని పోస్టింగ్స్‌ పెట్టేది. ఆమె సోషల్‌ మీడియా అకౌంట్ల మెసెజ్‌లు రాకుండా బ్లాక్‌ చేశాడు డానీ. ప్రేమించే ఉద్దేశం లేదని తన వైఖరి స్పష్టం చేయగా తన వ్యక్తిగత వివరాలు చెబుతూ ప్రేమించాలంటూ మానసికంగా వేధింపులకు పాల్పడింది. డానీ తనను ప్రేమించడని డిసైడైన జోసి మరోవైపు నుంచి స్టోరీని నడపాలనుకుంది.

జోయి టాన్‌ను కలిసి నీ ప్రియుడు కావాలని, అతడిని ప్రేమిస్తున్నానని జోసి చెప్పింది. మా ప్రేమను ఓడించలేరని జోయి తేల్చి చెప్పడంతో వేధింపులకు గురిచేసేది. ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడేది. చివరి ప్రయత్నంగా రూ.1.5 కోట్లు ఇస్తాను .. డానీని నాకు వదిలేయ్‌ అంటూ జోయికి భారీ ఆఫర్‌ ఇచ్చింది. నా లవర్‌ను ఎవరికీ వదులుకునే ప్రసక్తే లేదని, ఒకవేళ నేను బ్రేకప్‌ చెప్పినా.. డానీ నిన్ను మాత్రం ప్రేమించడన్న విషయం తెలుసుకోమని జోయి సూచించింది. ముందు నీ రేటెంతో చెప్పు.. అవసరమైతే నేనే నీకు డబ్బులు సర్దుతానంటూ జోసి లీకి డానీ లవర్‌ జోయి రివర్స్‌ ఆఫర్‌ తో షాకిచ్చింది. ఆ వివరాలను జోయి టాన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement