
దాడి జరిగిన తాజ్ మహాల్ హోటల్ - హ ఫీజ్ సయీద్
వాషింగ్టన్: ముంబైలో 2008లో ఉగ్రవాద దాడులకు పాల్పడిన పాకిస్తాన్లోని నిందితుల నుంచి తమకు రూ. 4,232 కోట్లు(68.8 కోట్ల డాలర్లు) పరిహారం ఇప్పించాలని నాటి దాడుల బాధితుల బంధువులు న్యూయ్కార్క్‌లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్లకు చెందిన తొమ్మిది మంది పౌరుల బంధువులు ఈ పిటిషన్ వేశారు.
జేయుడి(జమాత్-ఉద్-దవా) చీఫ్ హ ఫీజ్ సయీద్, లష్కరే తోయిబా కమాండర్ జకీరుల్ రెహ్మాన్ లక్వీ తదితరులపై విచారణ జరిపించాలని, వారి నుంచి ఈ మొత్తాన్ని ఇప్పించాలని వారు కోరారు. గత ఏడాది నవంబర్‌లో ఇవే విజ్ఞప్తులతో వేసిన పిటిషన్‌కు నిందితులు స్పందించనందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
**