ఫోక్స్ వాగన్ సీఈఓగా ముల్లర్
బెర్లిన్ : జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్ వాగన్ సీఈఓగా మత్తియాస్ ముల్లర్ నియామకమయ్యారు. సంస్థపై కుంభకోణం నేపథ్యంలో ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో బుధవారం నాడు సీఈఓ పదవికి మార్టిన్ వింటర్ కార్న్ చేసిన విషయం విదితమే. అయితే, శుక్రవారం నాడు జరిగిన బోర్డు సమావేశంలో ముల్లర్ను సీఈఓగా ప్రకటించారు. కొత్త సీఈఓ ముల్లర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. ప్రజల్లో పోయిన పేరును, నమ్మకాన్ని తిరిగి తీసుకురావడానికి కృషిచేస్తాను. సంస్థ నియమాలను మరింత కఠినతరం చేయనున్నట్లు చెప్పాడు. సంస్థకు చెందిన పోర్చె యూనిట్కు అధిపతిగా ముల్లర్ పనిచేస్తున్నారు.
1.1 కోట్ల కార్లలో పొల్యూషన్ చెక్ కనిపెట్టకుండా చేసేందుకు ఓ రకమైన ఇంజిన్లను అమర్చి ఫోక్స్ వాగన్ భారీ కుంభకోణానికి తెరతీసిన విషయం అందరికి విదితమే. అమెరికాలో చేసిన పొల్యూషన్ పరీక్షలలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఒక్కో విషయం బయడపడ్డాయి. అమెరికాలోనే సుమారు 5 లక్షల డీజిల్ కార్లలో ఇటువంటి పరికరాలను ఆ సంస్థ అమర్చినట్లు కనుగొన్నారు.