ఫోక్స్ వాగన్ పై చర్యలు రెట్టింపు | VW Doubles Provisions for Cheating Scandal to $18.2 Billion | Sakshi
Sakshi News home page

ఫోక్స్ వాగన్ పై చర్యలు రెట్టింపు

Published Sat, Apr 23 2016 1:03 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

ఫోక్స్ వాగన్ పై చర్యలు రెట్టింపు

ఫోక్స్ వాగన్ పై చర్యలు రెట్టింపు

కర్బన ఉద్గారాల మోసపూరిత కేసులో ఫోక్స్ వాగన్ పై చర్యలు తీవ్రం అవుతున్నాయి. కంపెనీ చెల్లించాల్సిన జరిమానా నిబంధనల ప్రకారం రెట్టింపు అయింది. మోసపూరిత కేసులో 6.7 బిలియన్ యూరోలుగా ఉన్న జరిమానా, రెండు రెట్లు అధికంగా ప్రస్తుతం 16.2 బిలియన్ యూరోలు ( 18.2 బిలియన్ డాలర్లు) అయిందని యూరప్ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వాగన్ తెలిపింది. ఈ రెట్టింపు చెల్లింపులతో కంపెనీ ఆర్థిక పరిస్థితి పడిపోతోంది. కంపెనీ ఇస్తున్న వార్షిక డివిడెంట్ ను 97 శాతం తగ్గించి, ప్రాధాన్య షేర్లకు 0.17 యూరోలు చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఫోక్స్ వాగన్ షేర్లు కూడా 1.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఈ ఉద్గారాల మోసపూరిత కేసు బయటికి పొక్కక ముందు అక్టోబర్ లో ఫోక్స్ వాగన్ షేర్లు 45 శాతం రైజింగ్ లో నడిచాయి. 2016లో ఫోక్స్ వాగన్ అమ్మకాలు సాధారణంగా ఉంటాయని, రెవెన్యూలు 5 శాతానికి పడిపోయే అవకాశాలున్నట్టు కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం కంపెనీ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని గణాంకాల రూపంలో విడుదల చేసింది. ఇవి ఫోక్స్ వాగన్ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాథ్యూస్ ముల్లెర్ తెలిపారు. అయితే ప్రస్తుతం కంపెనీ తయారుచేస్తున్న కార్లలో వాడే  ఉద్గారాలు నాణ్యమైనవిగా పేర్కొన్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఫోక్స్ వాగన్ అంత ఎక్కువ శ్రద్ధ వహించడం లేదని వెల్లడించారు. ఈ మోసపూరిత కేసు సెప్టెంబరులో బయపడింది. అక్రమ ఇంజన్ నియంత్ర సాప్ట్ వేర్ ను ఉద్గారాల టెస్టులకు వాడుతుందని యూఎస్ పర్యావరణ రక్షిత ఏజెన్సీ వెల్లడించింది. ఈ మోసాల గురించి నివేదికల రూపంలో బహిర్గతమైనప్పటికీ ప్రజల్లోకి రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. అనంతరం రెండు నెలల వ్యవధిలో యూఎస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, మార్కెట్లో ఉన్న కార్లను కంపెనీ వెనక్కి రప్పించుకుంది. ఇప్పటికీ ఆ కంపెనీ జరిమానాలు, క్రిమినల్ ఇన్ వెస్టిగేషన్లు ఎదుర్కొంటోంది. ఈ కుంభకోణం బయటపడిన కొన్ని రోజులకే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ వింటర్ కార్న్ రాజీనామా చేశారు. అప్పటినుంచి ఈ కేసులో ఫోక్స్ వాగన్ తలమునకలవుతోంది.

Advertisement
Advertisement