ఫోక్స్వాగన్కు షాకిచ్చిన ఇన్వెస్టర్లు | VW Investors Seek $9.2 Billion in Germany in Diesel Scandal | Sakshi
Sakshi News home page

ఫోక్స్వాగన్కు షాకిచ్చిన ఇన్వెస్టర్లు

Published Wed, Sep 21 2016 3:44 PM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM

ఫోక్స్వాగన్కు షాకిచ్చిన ఇన్వెస్టర్లు - Sakshi

ఫోక్స్వాగన్కు షాకిచ్చిన ఇన్వెస్టర్లు

కర్బన ఉద్గారాల స్కాంకు పాల్పడి ప్రపంచాన్నే మోసం చేసిన జర్మన్ కార్ల తయారీ దారి ఫోక్స్వాగన్కు స్వదేశంలో భారీ షాక్ తగిలింది. ఫోక్స్వాగన్ ఏజీ పెట్టుబడిదారులు ఆ కంపెనీ నుంచి 9.2 బిలియన్ డాలర్ల(రూ.61,662 కోట్లకు పైగా) నష్టపరిహారం కోరుతూ దావా దాఖలు చేశారు. కంపెనీ ఈ స్కాంను బయటపెట్టడంలో ఫోక్స్వాగన్ జాప్యం చేసినందున్న వారికి తీవ్ర నష్టం వాటిల్లిందని జర్మన్ పెట్టుబడిదారులు ఈ దావాలో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఫోక్స్వాగన్ ఖండిస్తోంది. ఈ దావాతో బ్రౌంస్చ్వేగ్ ప్రాంతీయ కోర్టులో మొత్తం 1,400 దావాలు పెండింగ్లో ఉన్నాయి.  
 
2015 సెప్టెంబర్ 18న ఈ స్కాం బయటికి పొక్కింది. ఫోక్స్వాగన్ అక్రమ ఇంజన్ నియంత్ర సాప్ట్ వేర్ను ఉద్గారాల టెస్టులకు వాడుతుందని యూఎస్ రెగ్యులేటరీ బయటపెట్టింది. ఈ స్కాం బయపపడిన మొదటి రెండు ట్రేడింగ్ రోజుల్లోనే జర్మనీలో ఫోక్స్వాగన్ షేర్లు, ఆ కంపెనీ విలువలో మూడు వంతుకు పైగా క్షీణించాయి. జర్మనీ పెట్టుబడిదారులకు ఈ స్కాం భారీ షాక్ను ఇచ్చింది. ఈ స్కాం బయటపడి ఏడాది కావొస్తున్నందున్న, ఏడాదిలో ఈ కంపెనీపై దావా నమోదుచేయాలని పెట్టుబడిదారులు నిర్ణయించారు.  ఈ నేపథ్యంలో ఫోక్స్వాగన్పై 9.2 బిలియన్ డాలర్ల దావా వేస్తున్నట్టు జర్మన్ పెట్టుబడిదారులు ప్రకటించారు. 
 
11మిలియన్ డీజిల్ వాహనాల్లో అక్రమ సాప్ట్వేర్ను ఉపయోగించి ఫోక్స్వాగన్ ఈ స్కాంకు పాల్పడింది. అయితే ఫోక్స్వాగన్ కంపెనీపై దావా వేసే గడువు ఎప్పుడు ముగుస్తుందో తెలియనందున్న ఇంకా చాలా దావాల నమోదు పెండింగ్లో ఉన్నాయి. అన్ని ఫిర్యాదులు నమోదుచేయడానికి కోర్టుకు ఇంకా నాలుగు వారాల సమయం అవసరమవుతుందని తెలుస్తోంది. మరోవైపు ఈ స్కాంను బట్టబయలు చేసిన అమెరికాలో పెట్టుబడిదారులు నష్టపరిహారం కింద 30 మిలియన్ యూరోలు కోరుతూ దావా వేసిన సంగతి తెలిసిందే. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement