సెలబ్రిటీ పాండా చనిపోయింది! | Worlds oldest and effective panda Basi dies | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీ పాండా చనిపోయింది!

Published Fri, Sep 15 2017 12:45 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

సెలబ్రిటీ పాండా చనిపోయింది!

సెలబ్రిటీ పాండా చనిపోయింది!

  • ఎక్కువ కాలం జీవించిన పాండాగా గుర్తింపు
  • బీజింగ్: ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన జెయింగ్ పాండా బాసి ఇకలేదు. చైనాలో 37 ఏళ్ల పాటు జీవించిన ఈ వృద్ధ పాండా గురువారం చనిపోయింది. ఈ విషయాన్ని ఆగ్నేయ చైనాలోని ఫుజౌ జూ నిర్వాహకులు వెల్లడించారు. పాండాలు 37 ఏళ్లు జీవించడమంటే మాటలు కాదు. ఎందుకంటే మనిషి 170 సంవత్సరాలు జీవించడంతో 37 సమానం అన్నమాట.

    నాలుగు లేదా ఐదేళ్ల వయసులో బాసి అనే లోయలో దొరకడంతో దీనికి ఆ పేరు పెట్టారు. బాసి చైనాలో చిన్నసైజు సెలబ్రిటీ. బరువులు మోయడం, బైక్ నడపటం, ఆటలు ఆడటం ఇలా ఎన్నో పనులు చేయడం దీని ప్రత్యేకత. ప్రతిఏటా బాసి పుట్టనరోజు వేడుకలను జూ అధికారులు ఎంతో ఘనంగా నిర్వహించేవారు. 1990లో నిర్వహించిన తొలి ఏషియా గేమ్స్‌ మస్కట్‌కు ఇది స్ఫూర్తిగా నిలవడం విశేషం.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement