
ఎలా వచ్చిందో తెలియదు కానీ నా జీవితంలోకి ఒక వెలుగులా వచ్చింది ఆమె. ఒకరి చేతిలో మోసపోయి అంధకారంలో ఉన్న నా జీవితంలో వెలుగులు నింపడానికి వచ్చింది నా హనీ. నేను నమ్మిన ఓ మనిషి నన్ను మోసం చేసి వెళ్లి పోయింది అన్న బాధలో ఉన్న సమయంలో నన్ను మాములు మనిషిని చేసింది తను.
అది మా డిగ్రీ ఫైనల్‌ఇయర్. అందరిలా మేము కూడా పరీక్షలు అయిపోగానే బీచ్‌కు వెళ్లి ఎంజాయ్ చేద్దామ్ అనుకున్నాం. బీచ్‌కు వెళ్లి ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాం. అప్పటివరకు తన మీద నాకున్న ఫీలింగ్ ఫ్రెండ్‌షిప్ అనే అనుకున్నా కానీ తనని వదిలి వెళ్లిపోతున్నా అంటే ఏదో తెలియని బాధ కలిగింది. తనకు కూడా అదే ఫీలింగ్ ఉంది. ఆ క్షణం తను ఏడుస్తుంటే నా ఫీలింగ్స్ అస్సలు కంట్రోల్ కాలేదు. అప్పుడు అర్థం అయ్యింది తన మీద నాకు ఉండే ఫీలింగ్ ఫ్రెండ్‌షిప్ కాదు ప్రేమ అని. రెగ్యూలర్‌గా ఉన్నట్టే తను కాల్స్, మెసేజ్‌లు చేస్తుంది అనుకున్నాను. కానీ కాలేజీ నుంచి వెళ్లిన తరువాత తన నుంచి ఎటువంటి కాల్స్ కానీ మెసేజ్‌లు కానీ లేవు. ఇక నాకు పట్టరాని దుఃఖం వేసింది. నాకు తనని చూడాలి, మాట్లాడాలి అన్న ఆలోచనలు తప్ప మరేమీ రావడం లేదు. ఇలా ఉండగా అనుకోకుండా ఒక రోజు ఆమె నుంచి కాల్ వచ్చింది. అప్పుడు పట్టలేనంత ఆనందం వచ్చింది. ఇక అప్పటి నుంచి ఫోన్‌లు మెసేజ్‌లు మొదలయ్యాయి. నా రోజు ఆమె చేసే ఫోన్‌తోనే స్టాట్ అయ్యేది. ఆమె చేసే కాల్‌తోనే ఎండ్ అయ్యేది. తనతో మాట్లాడే ప్రతి రోజు నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. కానీ ఆ ఆనందం చాలా రోజులు నిలవలేదు. నేను సంతోషంగా ఉండటం ఆ దేవుడికి ఇష్టం లేదేమో.
తనకి నా ప్రేమను చెబుదామని ఒక రోజు కాల్ చేశాను. కానీ తనే నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తనను ఇంటర్‌మీడియట్ నుంచి ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు అంటా తనకి ఓకే చెప్పనా అని నన్నే అడిగింది. ఆ క్షణం నా కన్నీళ్లు ఆగలేదు. నీకు ఇష్టమైతే ఓకే చెప్పు అని ఫోన్ పెట్టేశాను. కానీ ఎక్కడో చిన్న ఆశ ఉండేది తను నా ప్రేమను అర్థం చేసుకుంటుంది అని. తరువాత తను నాతో ఫోన్ మాట్లాడటం తగ్గించేసింది. అడిగితే బిజీ అని, క్లాస్‌లో ఉన్నాను అని చెప్పేది. ఆ తరువాత తన లవర్ మాటలు విని నా నంబర్ బ్లాక్ చేసింది. తరువాత నన్ను ఒక క్యారెక్టర్‌లెస్‌గా అందరి ముందు క్రియేట్ చేసింది. ఆ బాధలో ఏం చేయాలో తెలియక బాగా డ్రింక్ చేశాను. అదే నా జీవితంలో నేను ఫస్ట్ టైం తాగడం. అయినా అప్పటికీ తన కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా.
ఒక సంవత్సరం తరువాత మళ్లీ తన నుంచి కాల్ వచ్చింది. తనకు తన బాయ్ ఫ్రెండ్‌కు గొడవ అయ్యిందని చెప్పింది. మాట్లాడాలి అని లేకపోయిన తన మీద ఉన్న ఇష్టంతో ఏదో కొంచెం కొంచెం మాట్లాడే వాడిని.అలా మాట్లాడటం మొదలు పెట్టాక మళ్లీ మేమిద్దరం క్లోజ్ అయ్యాము. అది అలా ఉండగా తను మళ్లీ తన బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్ కంటిన్యూ చేస్తాను అని అడిగింది. ఇక నా నోటి నుంచి మాట రాలేదు. నీ ఇష్టం అని చెప్పి సైలెంట్‌గా ఉండిపోయాను. ఒక రోజు తను ‘నా బాయ్‌ఫ్రెండ్ అంటే నీకు ఎందుకు అంత కోపం’ అని అడిగింది. ఏం చెప్పాలి తనకింకా నేను...
అలా అడిగినప్పుడు తనని గట్టిగా హగ్ చేసుకొని పిచ్చిదాన నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం అని చెప్పాలనిపిస్తుంది. పగిలిన నా హృదయాన్ని అతికించిమరీ పగలగొట్టి వెళ్లిపోయింది. ఇప్పటికీ తను నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది.
దినేష్ (గుంటూరు).
Comments
Please login to add a commentAdd a comment