సారే జహాసే అచ్ఛా | Aamir Khan's Rakesh Sharma biopic has a title, and it's Saare Jahan Se Achcha | Sakshi
Sakshi News home page

సారే జహాసే అచ్ఛా

Published Wed, Jun 7 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

సారే జహాసే అచ్ఛా

సారే జహాసే అచ్ఛా

‘సారే జహాసే అచ్ఛా...’ అన్న గీతం ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఓ విధమైన ఉద్వేగం, ఉత్తేజం కలుగుతాయి కదూ! అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్‌ శర్మను నాటి ప్రధాని ఇందిరా గాంధీ, ‘అంతరిక్షం నుంచి చూస్తే భారతదేశం ఎలా ఉంది?’ అనడిగితే, ‘సారే జహాసే అచ్ఛా..’ అని సింపుల్‌గా చెప్పేసి, దేశంపై తనకున్న మక్కువ చూపుకున్నారు.

ఇప్పుడాయన జీవిత కథను సినిమాగా తీసేందుకు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ రెడీ అయిపోయారు. కొత్తదర్శకుడు మహేష్‌ మతై తెరకెక్కించనున్న ఈ సినిమాకు ‘సారే జహాసే అచ్ఛా..’ అన్న టైటిల్‌నే ఖరారు చేసేశారట. మొదట ‘సెల్యూట్‌’ అనే టైటిల్‌ను అనుకున్నా, చివరకు ‘సారే జహాసే అచ్చా’కే ఫిక్స్‌ అయ్యారట. ‘దంగల్‌’ అంటూ ఈ మధ్యే ఓ బయోపిక్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన ఆమిర్‌ వెంటనే మరో బయోపిక్‌కు రెడీ అయిపోవడం విశేషంగా చెప్పుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement