టాప్‌లెస్ ఫొటో పోస్ట్ చేసిన నటి | actress Jacqueline Fernandez posts a topless photo | Sakshi
Sakshi News home page

టాప్‌లెస్ ఫొటో పోస్ట్ చేసిన నటి

Published Sat, Jul 1 2017 3:41 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

టాప్‌లెస్ ఫొటో పోస్ట్ చేసిన నటి

టాప్‌లెస్ ఫొటో పోస్ట్ చేసిన నటి

ముంబై: తొలి మూవీ 'కిక్'తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి అభిమానులను తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటోంది నటి జాక్వెలైన్ ఫెర్నాండేజ్. సిద్ధార్థ్ మల్హోత్రాతో ఈ శ్రీలంక అందం జాక్వెలైన్ క్లోజ్‌ గా ఉండటం వల్లే సిద్ధార్థ్‌తో అలియా భట్ తమ వెకేషన్ టూర్‌ను రద్దు చేసుకన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆమె ఫొటోషూట్‌పై ఇండస్ట్రీతో పాటు జాక్వెలైన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం.. టాప్ లెస్‌గా ఫొటోలు దిగి ఫొటోషూట్ చేసిన నటి ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

'స్ట్రాంగ్ మైండ్, సున్నితమైన హృదయంతో ఇలా ఉన్నాను' అని క్యాప్షన్ ఇచ్చింది. జాక్వెలైన్ ఓ టాప్ లెస్ ఫొటో పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే రెండు లక్షల మంది ఫాలోయర్లు లైక్ చేయగా, రెండువేల కామెంట్లు వచ్చాయి. నటి టాప్ లెస్ ఫొటోపై కొందరు అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి ఫొటోలు స్టార్ హీరోయిన్‌గా ఉన్న మీకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం శ్రీలంక భామ అందాన్ని పొగుడుతూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైతేనేం.. చేతిలో భారీ ప్రాజెక్టులతో బిబీగా ఉన్నా ఫ్యాన్స్‌ దృష్టిని ఆకర్షించేందుకు జాక్వెలైన్ ఈ ఫొటోషూట్‌తో రెచ్చిపోయిందన్న భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం రీలోడెడ్ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా నటిస్తోన్న జాక్వెలైన్, వరుణ్ ధావన్‌ మూవీ జుడ్వా-2 షూటింగ్ పనులతో బిజిబిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement