ఆ పాత్రలో ఐష్ అదుర్స్ | Aishwarya Rai Bachchan, Randeep Hooda starrer ‘Sarbjit’ trailer unveiled | Sakshi
Sakshi News home page

ఆ పాత్రలో ఐష్ అదుర్స్

Published Thu, Apr 14 2016 2:39 PM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

ఆ పాత్రలో ఐష్ అదుర్స్

ఆ పాత్రలో ఐష్ అదుర్స్

ముంబై:  ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న బయోపిక్ 'సరబ్‌జిత్' ట్రైలర్ వచ్చేసింది. గురువారం విడుదలైన ఈ మూవీ ట్రైలర్ నెట్‌లో హల్ చల్ చేస్తోంది.  బాలీవుడ్‌లో ఇపుడు బయోపిక్ ల హవా నడుస్తోంది. ఈ సమయంలోనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరబ్‌జిత్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో మధ్య వయస్కురాలి పాత్రను ఎంచుకున్న  ఐశ్వర్యా రాయ్ సాహసం, విలక్షణ ప్రాతను ఎంచుకున్న రణదీప్ హుడా ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది. రఫ్ లుక్‌లో కూడా తనదైన శైలిలో ఈ నీలికళ్ల సుందరి అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.

అటు దర్శకుడు ఓమంగ్ కుమార్ పైనా, అందాల తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్, రణదీప్ హుడాల పైనా  పొగడ్తలు వెల్లువెత్తాయి. రెండో ప్రయత్నంలో ఓమంగ్ దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. అలాగే దల్బీర్ కౌర్,  సోదరుడు సరభ్‌జిత్ సింగ్ మధ్య భావోద్వేగ దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరించాడంటున్నారు. అలాగే జైలునుంచి సోదరుడిని విడిపించేందుకు పోరాడిన అక్క దల్బీర్ కౌర్ పాత్రలో ఐష్ జీవించారంటూ విమర్శకులు  కొనియాడారు.

గూఢచర్యం,  తీవ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో మగ్గి, ఖైదీల చేతుల్లో హత్యకు గురైన సరబ్జిత్ సింగ్ అనే భారతీయ ఖైదీ జీవితం ఆధారంగా సరభ్ జిత్ సినిమా రూపొందింది, రిచాచద్దా, దర్శన్‌కుమార్ తదితరులు నటించిన ఈ మూవీ మే 20న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement