ఆ సీన్లలో ఆయన సిగ్గుపడ్డారు.. నేను కాదు! | Amala Paul reveals Thiruttu Payale 2 romantic scenes | Sakshi
Sakshi News home page

ఆ సీన్లలో ఆయన సిగ్గుపడ్డారు.. నేను కాదు!

Published Wed, Nov 29 2017 7:33 PM | Last Updated on Wed, Nov 29 2017 7:37 PM

Amala Paul reveals Thiruttu Payale 2 romantic scenes - Sakshi

సాక్షి, సినిమా: నటి అమలాపాల్‌ మైనా చిత్రంలో కొండవాసిగా నిండుగా దుస్తులు ధరించి నటించి అందరినీ ఆకట్టుకుంది. అంతకు ముందు చిందూ చమవెలి చిత్రంలో మేనమామతో వివాహేతర సంబంధం పెట్టుకుని అందాలు ఆరబోసి వివాదాల్లో చిక్కుందన్న విషయం తెలిసిందే. కాగా మధ్యలో దైవతిరుమగళ్‌ లాంటి కొన్ని చిత్రాలలో గ్లామర్‌ విషయంలో కాస్త ఆచితూచి నటించినా తాజాగా మళ్లీ తన గ్లామర్‌ ప్రతాపాన్ని తిరుట్టుప్పయలే -2 చిత్రంలో చూపింది. బాబిసింహా, ప్రసన్న నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ సంస్థ సుశీగణేశన్‌ దర్శకత్వంలో నిర్మించింది. ఈ చిత్రం గురువారం తెరపైకి రానుంది.

ఇందులో బాబీసింహా పోలీస్‌ అధికారిగా నటించారు. ఆయనది ఇతరుల సంభాషణలను ఫోన్‌ ట్రాప్‌ చేసి విని వారిని బ్లాక్‌మెయిల్‌ చేసే పాత్ర అని తెలిసింది. ఇది వివాహేతర సంబంధాల కారణంగా ఎదురయ్యే సమస్యలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందట. ఇందులో బాబీసింహా, అమలాపాల్‌ ల రొమాంటిక్‌ సన్నివేశాలు మోతాదు మించి ఉంటాయని ప్రచారం జోరందుకుంది. దీనిపై అమలాపాల్‌ మాట్లాడుతూ.. తిరుట్టుప్పయలే -2 చిత్రంలో రొమాన్స్‌ సన్నివేశాలలో నటించడానికి బాబీసింహా కాస్త బిడియపడ్డారు గానీ, నేను మాత్రం ఎలాంటి సంశయం లేకుండా నటించానని చెప్పింది. ఈ సన్నివేశాల్లో నటించినందుకు తనకు ఇంత ప్రచారం వస్తుందని ఊహించలేదంటోంది. మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులు అమలాపాల్‌ గ్లామర్‌ నటనకు ఎలా రియాక్ట్‌ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement