'25 శాతం లివర్ తోనే జీవిస్తున్నా.!' : అమితాబ్
33 ఏళ్ల క్రితం కూలీ సినిమా షూటింగ్లో గాయపడిన అమితాబ్, ఇప్పటికీ ఆ ప్రమాదం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటునే ఉన్నాడు. ఇన్నేళ్ల తరువాత ఆ ప్రమాదం పై మాట్లాడిన అమితాబ్, ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించాడు.
'కూలీ షూటింగ్ ప్రమాదంలో దాదాపు 60కి బాటిల్ల రక్తం ఎక్కించారు. అయితే అదే సమయంలో ఆస్ట్రేలియన్ యాంటిజెన్ హెప్ బి నా శరీరంలోకి ప్రవేశించింది. 2004 - 05లో సాదరణ పరీక్షల సమయంలో నా శరీరంలో ఈ వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే అప్పటికే ఆ వైరస్ 75 శాతం లివర్ను తినేసింది. ప్రస్తుతం నేను 25 శాతం లివర్తోనే జీవిస్తున్నా. అది కూడా వైద్య సహాయంతో. మామూలుగా ఇలాంటి పరిస్థితి మధ్యం సేవించే వారికి వస్తుంది. కానీ మీ అందరికీ తెలుసు నేను మద్యం తాగను'.
సోమవారం హెపటైటిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ తన ఆరోగ్యానికి సంబందించిన విషయాలను వెల్లడించాడు.