మిథాలీ లైఫ్‌ సినిమాగా... | A biopic on Cricketer Mithali Raj Soon | Sakshi
Sakshi News home page

మిథాలీ బయోపిక్‌ వచ్చేస్తోంది

Published Tue, Sep 26 2017 12:00 PM | Last Updated on Tue, Sep 26 2017 2:23 PM

A biopic on Cricketer Mithali Raj Soon

సాక్షి, సినిమా : మరో మహిళా క్రికెటర్‌ బయోపిక్‌కు రంగం సిద్ధమౌతోంది. టీమీండియా కెప్టెన్‌ మిథాలీరాజ్‌ సక్సెస్‌ జర్నీని సినిమాగా మలిచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మేరకు హక్కులు కొనుగోలు చేసి మిథాలీతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు ముంబై మిర్రర్‌ ఓ కథనం ప్రచురించింది. 

వన్డేలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కిన మిథాలీ జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం. అందుకే చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాం అని వయాకమ్‌18 మోషన్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. శక్తివంతమైన మహిళలపై సినిమాలు తెరకెక్కించేందుకు మేము ఎప్పుడూ ముందుంటాం. ఈ క్రమంలోనే కహానీ, మేరీ కోమ్‌ లాంటి కథలను తీశాం. ఇప్పుడు మిథాలీ కథను చూపించబోతున్నాం అని వయాకమ్‌18 సీవోవో అజిత్‌ అందారే చెబుతున్నారు. 

మరోపక్క తన కథను సినిమాగా తెరకెక్కించబోతుండటంపై మిథాలీ సంతోషం వ్యక్తం చేస్తోంది. తన చిత్రం మరికొంత మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలిస్తే చాలని 34 ఏళ్ల స్టార్‌ బ్యాట్స్‌ ఉమెన్‌ అంటోంది. అయితే మిథాలీ పాత్రలో మెరిసే నటి ఎవరో.. తదితర వివరాలు త్వరలో తెలియజేస్తామని వయాకమ్‌18 చెబుతోంది. ఇదిలా ఉంటే మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పిన భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌ కూడా ఛక్‌ధా పేరుతో సిద్ధమౌతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement