బుల్లితెరపై బ్రిట్నీ స్పియర్స్ బయోపిక్ | Britney Spears biopic coming to TV soon | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై బ్రిట్నీ స్పియర్స్ బయోపిక్

Published Thu, Aug 25 2016 1:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

బుల్లితెరపై బ్రిట్నీ స్పియర్స్ బయోపిక్

బుల్లితెరపై బ్రిట్నీ స్పియర్స్ బయోపిక్

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ బయోపిక్ రెడీ అవుతోంది. అంతర్జాతీయ సంగీత అభిమానులను అలరించిన ఈ బ్రిట్నీ జీవితాన్ని టీవీ షోగా రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బ్రిట్నీ కూడా తన అంగీకారాన్ని తెలపటంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన వెలువడింది.

ఈ టీవీ షోకు లెస్లీ లిబ్మన్ దర్శకత్వం వహించే అవకాశం ఉండగా ప్రముఖ నటి నటాషా బాస్సెట్, బ్రిట్నీ స్పియర్స్ పాత్రలో నటించనుంది. రెండు గంటల నిడివితో రూపొందనున్న ఈ బయోపిక్లో బ్రిట్నీ స్టార్ డమ్, ఇమేజ్తో పాటు ఆమె జీవితంలోని ఎత్తుపల్లాలను కూడా చూపించనున్నారు. అంతేకాదు జస్టిన్ టింబర్లేక్, అలగ్జాండర్, కెవిన్లతో బ్రిట్నీకి ఉన్న సంబందాలను కూడా ప్రస్థావించనున్నారట. అస్లమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ బయోపిక్కు బ్రిట్నీ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 19న  షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement