ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం ‘ఛపాక్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీ శివార్లలో జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సినిమాను దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్నప్పటికీ.. షూటింగ్ స్పాట్‌లోని సీన్లు లీకవుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ శివార్లలో షూటింగ్ సందర్భంగా సినిమాలో ప్రధాన పాత్రధారులైన దీపిక, విక్రాంత్ మస్సే లిప్‌లాక్ సీన్లు లీకయ్యాయి. సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ భవనం టెర్రాస్‌పై సన్నిహితంగా గడుపుతూ.. పెదవులతో పెదవులను ముద్దాడే సీన్ తాజాగా చిత్రయూనిట్ తెరకెక్కించింది. ఢిల్లీలోని ఓ స్లమ్ ఏరియాలో తెరకెక్కించినట్టు భావిస్తున్న ఈ రొమాంటిక్ సీన్ దృశ్యాలు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లీకయ్యాయి.
దీపికా పదుకొనే ఫ్యాన్ పేజీలతోపాటు పలు ఇన్‌స్టాగ్రామ్ పేజీలు షేర్ చేసిన ఈ వీడియోలు వెంటనే వైరల్ అయ్యాయి. గతంలో ‘ఛపాక్’ సినిమా షూటింగ్‌కు సంబంధించి పలు సీన్లు లీకై సంగతి తెలిసిందే. ఇంట్రస్టింగ్ సీన్లకు సంబంధించి షూటింగ్ దృశ్యాలు లీకవుతుండటం డైరెక్టర్ మేఘనా గుల్జార్‌ను ఆందోళన పరుస్తోంది. విడుదలయ్యే వరకు తన సినిమాలోని విశేషాలు బయటకు పొక్కకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజా సినిమా షూటింగ్‌కు కూడా ఆమె సెక్యూరిటీ కల్పించినప్పటికీ.. పలు కీలకమైన సీన్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. లీకైన దీపిక రొమాంటిక్ సీన్లపై నెటిజన్లు ఇంట్రస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు. దీపిక సీన్లు బాగా రొమాంటిగ్గా ఉన్నాయని, పిల్లలకు చూపించకండి అంటూ చమత్కరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment