
బాలీవుడ్‌లో విరుష్క (విరాట్ కోహ్లి–అనుష్కా శర్మ) ఏడడుగులు వేసిన తర్వాత ఇప్పుడందరూ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్‌ల మూడు ముళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. రీసెంట్‌గా తనకు కాబోయే భర్త పేరు ‘ఆర్’తో మొదలవుతుందని దీపికా పేర్కొన్నారు. దీంతో ఆ ‘ఆర్’ రణ్‌వీర్ సింగేనని బాలీవుడ్‌లో అంతా అనుకుంటున్నారు. దీపికా ఎప్పుడైతే ‘ఆర్’ అక్షరం గురించి చెప్పారో.. అప్పటినుంచి ఆమె పెళ్లి గురించి రకరకాల కథనాలు మొదలయ్యాయి. వాటిలో నిశ్చితార్థం కథనం ఒకటి.
ఇవాళ దీపికా పదుకోన్ పుట్టినరోజు. ఈరోజే రణ్‌వీర్, దీపికల నిశ్చితార్థం జరుగుతుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ వేడుక ఎక్కడ? అంటే శ్రీలంకలో అని కూడా ఊహాగానాలు చేస్తున్నారు. దానికి కారణం రణ్‌వీర్ సింగ్ శ్రీలంక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. హాలీడేస్‌లో ఉన్న దీపిక కూడా శ్రీలంక వెళ్లేందుకు రెడీ అవుతుందని బాలీవుడ్ వర్గాల కథనం. మరి...శ్రీలంకలో రణ్‌వీర్, దీపికలు నిశ్చితార్థం చేసుకుంటారో? లేక దీపికా బర్త్‌డే పార్టీకి శ్రీలంకను డెస్టినేషన్‌గా ప్లాన్ చేశారో ఈరోజు తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment