తమాషా చేయనున్న శ్రీ
తమాషా చేయనున్న శ్రీ
Published Thu, Oct 24 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను అలరించేలా కావల్సినంత వినోదం ఇవ్వడానికి శ్రీ జ్యోతిప్రసన్న మూవీస్ సంస్థ ‘తమాషా’ అనే చిత్రం నిర్మించనుంది. ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ హీరోగా శ్రీనివాస్ బల్లా దర్శకత్వంలో యం. విజయవర్ధనరావు, శివారెడ్డి నీలపు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే నెల 9న ఈ చిత్రం ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మలయాళ దర్శకుడు సిద్ధిక్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశారు శ్రీనివాస్ బల్లా. టైటిల్‌కి తగ్గట్టే ఈ చిత్రం వినోద ప్రధానంగా ఉంటుంది’’ అని చెప్పారు. మాధురి ఇటాగి, సునీత మార్షియా హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో ఎమ్మెస్ నారాయణ, సయాజీ షిండే, రవిప్రకాష్, ప్రవీణ్, దువ్వాసి మోహస్ తదితరులు ఇతర పాత్రలు చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రషీద్ మూపెన్, సంగీతం: రఘురామ్, నిర్వహణ: ముకుందరావు.
Advertisement
Advertisement