
‘‘అల్లు వంశీ, అక్షర జంటగా బొండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో లెంకల అశోక్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘గులాబీ మేడ’. సాకేత్ నాయుడు స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ– ‘‘గులాబి’ టైటిల్‌తో వచ్చిన గత సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి.
‘గులాబీ మేడ’ కూడా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది. దసరా నుంచి చిన్న సినిమాల కోసం 5వ ఆటకు అనుమతి ఇచ్చారు’’ అన్నారు. ‘‘అశోక్‌రెడ్డిగారు, నేను ఒక మంచి సినిమా చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మంచి కథ కుదరడంతో ‘గులాబీ మేడ’ తీశాం. అశోక్‌రెడ్డిగారు ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు బొండా వెంకటస్వామినాయుడు.