హీరోగా మరో సంగీత దర్శకుడు? | hero role in Music Director | Sakshi
Sakshi News home page

హీరోగా మరో సంగీత దర్శకుడు?

Published Sat, Apr 9 2016 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

హీరోగా మరో సంగీత దర్శకుడు?

హీరోగా మరో సంగీత దర్శకుడు?

 ప్రతిభ ఎవరి సొత్తు కాదు. అలాగే అదృష్టం ఎవరికీ సొంతం కాదు. ఒక రంగంలో పేరు తెచ్చుకున్న వారు అర్హత కలిగుంటే మరో రంగంలోనూ సాధించగలరు.అలా సంగీత రంగంలో తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న విజయ్‌ఆంటోని, జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇప్పుడు కథానాయకులుగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే బాటలో యువ సంగీత దర్శకుడు హిప్ హాప్ ఆది పయనించడానికి రెడీ అవుతున్నట్టు తాజా సమాచారం. స్వశక్తితో ఎదుగుతున్న సంగీత దర్శకుల్లో ఈయన ఒకరని చెప్పాలి.
 
 మొదట్లో సొంతంగా పాప్ సాంగ్స్ ఆల్బమ్‌లతో తనకంటూ గుర్తింపు తె చ్చుకున్న ఆది ఇప్పుడు సినీ సంగీతదర్శకుడిగా దూసుకుపోతున్నారు. దర్శకుడు సుందర్.సీ విశాల్ నటించిన ఆంబళ చిత్రంతో ఆదిని సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు.ఆ తరువాత తనీఒరువన్, అరణ్మణ-2 చిత్రాలతో సక్సెస్‌ఫుల్ సంగీతదర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు.ఈయనలో మంచి గాయకుడు,గీత రచయిత కూడా ఉన్నారన్నది గమనార్హం.
 
 కాగా ఆదిని సంగీతదర్శకుడిగా పరిచయం చేసిన సుందర్.సీనే ఇప్పుడు హీరోగా ప్రమోట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆయన అవ్నీ సంస్థలో స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్న తాజా చిత్రంలో హిప్ హాప్ తమిళ్ ఆదిని కథానాయకుడిగా ఎంపిక చేసినట్లు తెలిసింది.అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement