hero role
-
పాన్ ఇండియా ప్రాజెక్టు : సోనూసూద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..
సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా కాలంలో రియల్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆపదలో ఉన్న వారిని దేవుడిలా ఆదుకుంటూ, ఏ కష్టం వచ్చిన కాదనకుండా సాయం చేస్తూ ఆపద్భాందవుడిలా మారాడు. గతేడాది లాక్డౌన్లో ఎంతోమంది వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చడంతో ప్రారంభమవ్వగా.. ఇప్పటికీ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ తన సేవలను కొనసాగిస్తున్నాడు. తన పనులతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆదుకోవాలని అడిగిన వారందరికి నేనున్నానంటూ అండగా నిలుస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే రియల్ లైఫ్‌తో పాటు రీల్ లైఫ్‌లోనూ సోనూసూద్‌ని హీరోగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆయన సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు. అయితే ఇకపై హీరోలా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ పాన్ఇండియా సినిమాలో సోనూసూద్ హీరో పాత్ర పోషించనున్నారట. ఇందకోసం ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ ఓ మంచి కథను సిద్ధం చేశారని, సోనూసూద్‌కి కూడా కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్ పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తవగానే సోనూసూద్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్తారట. ఇదే నిజమైతే త్వరలోనే వెండితెరపై కూడా సోనూను హీరోగా చూడాలన్న చాలా మంది కల నెరవేరినట్లే. చదవండి : భవిష్యత్తు ప్రధాని సోనూసూద్.. స్పందించిన నటుడు Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆర్ఆర్ఆర్’ సర్ప్రైజ్ వచ్చేసింది -
రాక్షసుడు!
గతేడాది మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ పాత్ర చేసిన ఎస్.జె. సూర్య గుర్తుండే ఉంటారు. 2001లో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘ఖుషి’ చిత్రానికి కూడా ఎస్.జె. సూర్యానే దర్శకుడని తెలిసిన విషయమే. అప్పుడప్పుడు హీరోగా, విలన్‌గా చేస్తుంటారాయన. ఇప్పుడు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మాన్స్టర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మాన్స్టర్ అంటే రాక్షసుడు, భూతం అనే మీనింగ్స్ ఉన్నాయి. ‘ఒరు నాళ్ కూత్తు’ దర్శకుడు నెల్సన్ ఈ సినిమాకు దర్శ కత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. పిల్లల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. -
హీరోగా మరో సంగీత దర్శకుడు?
ప్రతిభ ఎవరి సొత్తు కాదు. అలాగే అదృష్టం ఎవరికీ సొంతం కాదు. ఒక రంగంలో పేరు తెచ్చుకున్న వారు అర్హత కలిగుంటే మరో రంగంలోనూ సాధించగలరు.అలా సంగీత రంగంలో తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న విజయ్‌ఆంటోని, జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇప్పుడు కథానాయకులుగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే బాటలో యువ సంగీత దర్శకుడు హిప్ హాప్ ఆది పయనించడానికి రెడీ అవుతున్నట్టు తాజా సమాచారం. స్వశక్తితో ఎదుగుతున్న సంగీత దర్శకుల్లో ఈయన ఒకరని చెప్పాలి. మొదట్లో సొంతంగా పాప్ సాంగ్స్ ఆల్బమ్‌లతో తనకంటూ గుర్తింపు తె చ్చుకున్న ఆది ఇప్పుడు సినీ సంగీతదర్శకుడిగా దూసుకుపోతున్నారు. దర్శకుడు సుందర్.సీ విశాల్ నటించిన ఆంబళ చిత్రంతో ఆదిని సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు.ఆ తరువాత తనీఒరువన్, అరణ్మణ-2 చిత్రాలతో సక్సెస్ఫుల్ సంగీతదర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు.ఈయనలో మంచి గాయకుడు,గీత రచయిత కూడా ఉన్నారన్నది గమనార్హం. కాగా ఆదిని సంగీతదర్శకుడిగా పరిచయం చేసిన సుందర్.సీనే ఇప్పుడు హీరోగా ప్రమోట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆయన అవ్నీ సంస్థలో స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్న తాజా చిత్రంలో హిప్ హాప్ తమిళ్ ఆదిని కథానాయకుడిగా ఎంపిక చేసినట్లు తెలిసింది.అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.