ఆన్ లైన్ సెన్సేషన్ కు హీరో సర్ ప్రైజ్
ముంబై: ఆన్ లైన్ సెన్సేషన్ ప్రజాక్త కోలిని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాడు. గురువారం ప్రజాక్త ఇంటికి వెళ్లి, స్వయంగా కలిసి అభినందించాడు. ఒన్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ సహకారంతో మోస్ట్ లీ సానే పేరుతో యూట్యూబ్ లో ఆమె నడుపుతున్న చానల్ సన్సేషనల్ హిట్ అయింది. హృతిక్ తన ఇంటికి రావడంతో ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని ప్రజాక్త పేర్కొంది. అవకాశం వస్తే ఆయనతో కలిసి పనిచేస్తానని సంతోషంగా చెప్పింది.
‘హృతిక్ స్వయంగా వచ్చి అభినందనలు చెబుతాడని అస్సలు ఊహించలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. హృతిక్ ను కలవాలని ఉందని నా పుట్టినరోజు సందర్భంగా ఒన్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ కు చెందిన గురుప్రీత్ సింగ్, సుదీప్ లహరితో చెప్పాను. వాళ్లే హృతిక్ ను మా ఇంటికి తీసుకొచ్చారని అనుకుంటున్నాన’ని ప్రజాక్త పేర్కొంది. తన చానల్ ను సబ్ స్కైబ్ చేసేందుకు హృతిక్ అంగీకరించాడని వెల్లడించింది.