ప్రేమలో జాదూగాడు
లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న కథానాయకుడు నాగశౌర్య, ఈ సారి పక్కా మాస్ పాత్రలో రఫ్ అండ్ టఫ్ గా కనిపించనున్నారు. ‘చింతకాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో సత్య ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వి.వి.యన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ‘హరహర మహాదేవ’ సీరియల్ ఫేం సోనారిక కథానాయిక. ఈ చిత్రానికి ‘జాదూగాడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘నాగశౌర్య గత చిత్రాలకు భిన్నంగా ఆయన పాత్రను తీర్చిదిద్దాం. వినోదంతో కూడిన మాస్ కథా చిత్రం ఇది’’ అని చెప్పారు. ఈ నెలలో పాటలను, ఏప్రిల్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, ఎడిటర్: ఎం.ఆర్. వర్మ, ఆర్ట్: సాహిసురేశ్.