రైల్వే స్టేషన్‌లో ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్
లాస్‌ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ సింగర్ జాన్ లెజెండ్ తన ఫ్యాన్స్‌ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఓ రైల్వే స్టేషన్‌లో చిన్నపాటి కచేరితో ఆడిపాడి చక్కగా అలరించాడు. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా అతడు ఈ పనిచేసి వార్తల్లో నిలిచాడు. ఆర్డినరీ పీపుల్, ఆల్ ఆఫ్ మి అనే రెండు గీతాలను ఎంతో నైపుణ్యవంతంగా పియానో వాయిస్తూ ఆలపించాడు.
హాలీవుడ్‌లో ప్రముఖ సింగర్ అయిన 38 ఏళ్ల జాన్ లెజెండ్ ప్యారిస్ నుంచి యూరోస్టార్ రైలులో వచ్చాడు. ఫ్రాన్స్ నుంచి తిరిగొచ్చిన తర్వాత అతడు ఏ మాత్రం ఆలోచించకుండా రైలు దిగగానే అదే స్టేషన్‌లో గానా కచేరి కార్యక్రమం పెట్టాడు. స్టేషన్‌లోనే కొద్ది మంది ముందు కొద్ది సేపు సరదాగా పియానో వాయిస్తూ పాటలు వినిపించి వెళ్లిపోయారు. అంతకుముందు త్వరలో తన డార్క్‌నెస్ అండ్ లైట్ అనే ఆల్బం విడుదల కాబోతున్నట్లు చెప్పాడు.